Pawan Kalyan Telangana Dishti.. కోనసీమ కొబ్బరికి దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే, దానికి తెలంగాణకు ఆపాదించి భుజాలు తడుముకున్నారు, కొందరు రాజకీయ నాయకులు.
చిత్రంగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు సైతం, ‘భుజాలు తడుముకున్న వారి’ లిస్టులో వున్నారు.!
అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు.? ఆ వ్యాఖ్యల్లో తమ గురించిన ప్రస్తావన ఏమైనా వివాదాస్పదంగా వుందా.? అన్న కనీసపాటి సోయ కూడా లేకుండా, భుజాలు తడిమేసుకున్నారు తెలంగాణ నాయకులు.
కోనసీమ పచ్చదనం గురించి తెలంగాణ నాయకులు కొందరు చెబుతుండేవారని మాత్రమే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక, దిష్టి వ్యవహారం, కోనసీమలో కొబ్బరి రైతులు మామూలుగా వాడే విషయమే.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో చెబుతున్నా, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే.. అతని సినిమాలు ఆడనివ్వను.. అనే స్టేట్మెంట్ ఇచ్చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించేశారు.
ఇంకొందరు తెలంగాణ నాయకులు, ఈ విషయానికి ప్రాంతీయ విద్వేషాలు అంటగట్టేందుకు శత విధాలా ప్రయత్నించారు.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వైసీపీ శ్రేణులు అలానే టీడీపీ శ్రేణులు.. ఈ వివాదంలో చలికాచుకునేందుకు ప్రయత్నించడం.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల కంటే ఎక్కువగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చేసిన అతి అంతా ఇంతా కాదు.!
మొత్తం నాలుగు పార్టీలకీ కౌంటర్ ఇవ్వడంతో జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు విజయం సాధించారు. ఆ రకంగా తెలంగాణలో, జనసేన క్యాడర్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యింది కూడా.
ఇక, సాయంత్రానికి తీరిగ్గా జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వక్రీకరించొద్దు’ అన్నది ఆ ప్రకటన తాలూకు సారాంశం.
‘క్షమాపణ’ ప్రకటన వస్తుందనుకుంటే, ‘వక్రీకరణ’ అంటూ ప్రకటన రావడం, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకి అస్సలు మింగుడు పడలేదు.
వైసీపీ కుల మీడియా కూడా, ఈ విషయమై గింజుకుంటోంది.! తెలంగాణ పౌరుషం.. అంటూ, నీలి కూలి మీడియా పడరాని పాట్లూ పడుతోందిప్పడు.!
అసలంటూ, పవన్ కళ్యాణ్ ‘దిష్టి’ వ్యాఖ్యల్లో, తెలంగాణ నాయకుల గురించిగానీ, తెలంగాణ ప్రజల గురించిగానీ ఎలాంటి విమర్శా లేనప్పుడు, వివాదానికే ఆస్కారం లేదు కదా.!
తెలంగాణలో సాధారణ ప్రజానీకం అస్సలు ఈ వివాదాన్ని పట్టించుకునే మూడ్‌లో లేదు. ‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో తెలంగాణని ఉద్దేశించి ఎలాంటి వివాదమూ లేదు’ అనేస్తున్నారు.
ఒక్కటి మాత్రం నిజం.. తెలంగాణలో బలేపేతమయ్యేందుకు వ్యూహ రచన చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఈ మొత్తం వ్యవహారం, ఓ పొలిటికల్ అడ్వాంటేజ్‌గా మారుతోంది.
