Pawan Kalyan Unstoppable AHA టీజరొచ్చింది.! కొంత నిరాశపర్చింది.! కానీ, ఈసారి అసలు సిసలు ప్రోమో వచ్చింది. ఇది హై ఓల్టేజ్ ప్రోమో.! ఇదీ అన్‌స్టాపబుల్ పవర్ అంటే.!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో టీడీపీ ఎమ్మెల్యే, నట సింహం నందమూరి తారక రామారావు ‘అన్ స్టాపబుల్ టాక్ షో’ ఫస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది.
ఇంతకీ పవన్ కళ్యాణ్ తన తల్లికి భయపడతాడా.? భార్యకి భయపడతాడా.? ఈ విషయమై బాలయ్య సంధించిన ప్రశ్న సరే, దానికి పవన్ ఇచ్చిన సమాధానమేంటో.!
Pawan Kalyan Unstoppable AHA.. వాట్ ఏ పవర్.!
ఔను, ప్రోమో చూశాక.. ఎవరైనా ఇదే మాట అనాలి.! ఆ స్థాయిలో ఎవరికైనా వైబ్రేషన్స్ వచ్చి తీరాల్సిందే.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వేసే ప్రశ్నలకు, పవన్ కళ్యాణ్ మార్క్ టైమింగ్.. వెరసి, ఇది హై ఓల్టేజ్ అన్‌స్టాపబుల్ పవర్ అన్నమాట.

‘నేను మీకు తెలుసు.. నా స్థానం నా మనసు’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ అభిమానులకు బీభత్సమైన కిక్ ఇచ్చింది.
‘సాయంత్రం..’ అని బాలకృష్ణ అనగానే, ‘నాలుగు తర్వాతా.? ఆరు తర్వాతా.?’ అని మధ్యలోనే పవన్ చెప్పడం.. ఫిట్టింగ్ మాస్టర్.. అంటూ రామ్ చరణ్‌తో నందమూరి బాలకృష్ణ మాట్లాడటం.!
వాట్ నాట్.. అంతా అదుర్స్ అంతే.!
ఈ పెళ్ళిళ్ళ గోలేంటి.? అనడిగితే.. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్.. ఆయన ఘాటైన సమాధానమే.. అదీ కష్టంగా ఇచ్చినట్లుగా అనిపించింది.
ఇక, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ, ‘తొడ కొట్టు’ అని బాలయ్య అడిగితే, బాలయ్య దగ్గరకు వెళ్ళడం.. ‘నా కాలి తొడ కాదు..’ అని బాలయ్య చెప్పడం.. సూపర్బ్.!
త్రివిక్రమ్‌తో స్నేహం చేయాల్సి వచ్చింది.. రామ్ చరణ్‌ని చూసుకోవాల్సి వచ్చింది.. ఇలాంటి డైలాగ్స్ పవన్ కళ్యాణ్ నోట.. డిఫరెంట్ టోన్‌లో వచ్చాయ్. ఆ టైమింగ్ గురించి రాయలేం.. ప్రోమో చూసి ఆ పవర్‌ని ఎంజాయ్ చెయ్యాల్సిందే.!
Also Read: తొక్కినేని ‘మెంటల్’ రచ్చ: నాగచైతన్యకి బాలయ్య మాస్ వార్నింగ్.!
ఈ ప్రోమో కోసం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా పవన్ కళ్యాణ్ సినిమాల్లోంచి పాటల్ని వాడిన వైనం.. వేరే లెవల్ అంతే.!