తెలుగు సినిమాని ‘పాడె’ మీదకు ఎక్కిస్తున్నదెవరు.?

 తెలుగు సినిమాని ‘పాడె’ మీదకు ఎక్కిస్తున్నదెవరు.?

Tollywood Actors

Tollywood Shootings Bandh.. ‘పుష్ప ది రూల్’ సినిమా కోసం 350 కోట్లు ఖర్చు చేస్తున్నారట.. ఎన్టీయార్, కొరటాల శివ కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా రూపొందుతోందట.. ఇలా మాట్లాడుకుంటున్నాం మనం.!

ఇంకోపక్క, తెలుగు సినీ పరిశ్రమలో సంక్షోభం. ‘సినిమాలు బంద్’ అంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించేయడం చూస్తే, అసలేమనుకోవాలి.?

ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమాల షూటింగులు బంద్ అయ్యాయి. ఎప్పుడు తిరిగి అవి ప్రారంభమవుతాయన్నదానిపై స్పష్టత లేదు.

నిర్మాణ వ్యయం పెరిగిపోయిందట.. సినిమా థియేటర్లకు జనం రావట్లేదట. అదీ అసలు సమస్య.

అగ్ర హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలనీ, నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోకపోతే తెలుగు సినిమాకి మనుగడ వుండదనీ ఏవేవో వాదనలు వినిపిస్తున్నాయి.

Tollywood Shootings Bandh.. ఔను, తెలుగు సినిమా మారింది.!

సినిమా తీరు మారింది. వంద కోట్ల బడ్జెట్ మాత్రమే కాదు, వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి హీరోలు ఎదుగుతున్నారు.

తెలుగు సినిమా సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలో నిర్మాణ వ్యయం పెరుగుతోంది. సరిగ్గా మార్కెట్ చేసుకుంటే కాసుల కనకవర్షమూ కురుస్తుంది.

Tollywood Actors
Tollywood Actors

తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. అది బహిరంగ రహస్యం. పిచ్చి కామెడీ ‘డీజే టిల్లు’ సినిమా ఎందుకు హిట్టయ్యింది.? మంచి సినిమా ‘విరాట పర్వం’ ఎందుకు దెబ్బ తినేసింది.?

చిరంజీవి, రవితేజ ఎందుకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టారు.? ఇలా ప్రశ్నించుకుంటూ వెళితే, పరిష్కారం దొరుకుతుంది. కానీ, సినిమా అంటే లాటరీ.. అది అందరికీ తెలిసిన విషయమే.

ఎవరూ అతీతులు కారు.!

రామ్ చరణ్, ప్రభాస్, మహేష్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా ప్రముఖ హీరోలెవరూ ఫ్లాపులకు అతీతం కాదు.

అన్నీ తెలిసీ, తెలుగు సినిమాని ‘పాడె’ మీదకు ఎక్కించేస్తున్నారు.. అదీ బతికుండగానే.! థియేటర్లను గుప్పిట్లో పెట్టుకునే నిర్మాతలు, కాంబినేషన్ల పేరుతో హీరోల్ని లాక్ చేసే నిర్మాతలు.. అబ్బో, కథ పెద్దదే.

హీరోలు తక్కువ కాదు, హీరోయిన్లూ తక్కువ కాదు. ఆఖరికి నిర్మాతల్ని కమెడియన్లు వేధించిన సందర్భాలూ వున్నాయి. దర్శకులు సైతం ఈ విషయంలో తక్కువేమీ కాదు.

Also Read: చిరంజీవిపై ఎర్ర పుష్పం వెర్రి కూతలు.! పేటీఎం పైత్యమే.?

అందరూ బాధితులే, అందరూ బాధిస్తున్నవారే. అదే తెలుగు సినిమాకి అతి పెద్ద సమస్య.

కోవిడ్ సంక్షోభంలో ప్రపంచ సినిమా ముందర తెలుగు సినిమానే ధైర్యంగా నిలబడింది. అలాంటి తెలుగు సినిమా, ఇప్పుడు షూటింగులు బంద్ చేసుకుందంటే.! కారణమెవ్వరు.?

Digiqole Ad

Related post