Pawan Kalyan Unstoppable.. ఇదేదో ‘టాక్ షో’ అని అనిపించలేదు చాలామందికి.! కానీ, ‘బాప్ ఆప్ ఆల్ టాక్ షోస్.. అండ్ బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్.!’ ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
సాధారణంగానే పవన్ కళ్యాణ్ చాలా తక్కువగా మాట్లాడుంటారు. బిడియం ఎక్కువ.! రాజకీయ వేదికలపై మాత్రం పవర్‌ఫుల్ డైలాగులు పేల్చుతుంటారనుకోండి.. అది వేరే సంగతి.
అన్‌స్టాపబుల్ టాక్ షో హోస్ట్‌గా నందమూరి బాలకృష్ణ, గెస్ట్ పవన్ కళ్యాణ్‌తో ముచ్చట్ల సందర్భంగా.. పవన్ కళ్యాణ్ మాట్లాడింది 10 శాతం అయితే, బాలకృష్ణ మాట్లాడింది 90 శాతం.!
Pawan Kalyan Unstoppable.. బాబోయ్.. ఇవేం ఎలివేషన్లు.!
‘ఆయన్ని పెళిళ్ళ విషయంలో ప్రశ్నించేవారు ఊర కుక్కలతో సమానం’ అని నందమూరి బాలకృష్ణ చెప్పిన మాట.. ఆ సమయంలో ఆయన బాడీ లాంగ్వేజ్ వేరే లెవల్.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి పవన్ కళ్యాణ్ ‘గురువు’ స్థానాన్ని ఇవ్వడం చూసి నందమూరి బాలకృష్ణ ఆశ్చర్యపోయారు.. పవన్ కళ్యాణ్‌కి ఫిదా అయిపోయారనడం అతిశయోక్తి కాదు.

సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించీ, చిన్నప్పుడు చరణ్ సింగపూర్‌లో చేసిన అల్లరి గురించీ.. ఇలా పలు విషయాలపై పవన్ కళ్యాణ్ ఎవరికీ తెలియని చాలా విషయాల్ని చెప్పారు.
‘నా టాక్ షోకి ఇప్పటిదాకా చాలామంది వచ్చారు. ఎవరూ ఇంత తక్కువగా మాట్లాడలేదు. అంతా నేనే మాట్లాడేస్తున్నా..’ అని బాలయ్య చెప్పడం మరో ఆసక్తికర ఘట్టం.
బాలయ్యకి హేట్సాఫ్..
సాధారణంగా, ఇలాంటి టాక్ షోలలో గెస్ట్‌ని ఉద్దేశించి హోస్ట్ నాలుగు మంచి మాటలు చెబుతారు. కానీ, బాలయ్య.. నాలుగు కాదు.. నలభై.. కాదు కాదు ఇంకా ఎక్కువే మంచి మాటలు చెప్పారు.
అవి పవన్ కళ్యాణ్ విషయంలో.. సినీ నటుడిగా, రాజకీయ నటుడిగా.. విపరీతమైన ఎలివేషన్స్ ఇచ్చినట్లయ్యింది పరిస్థితి.
ఈ క్షణం నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నందమూరి బాలకృష్ణని అభిమానించేస్తారేమో. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతారేమో.!
Also Read: తగ్గవయ్యా తమ్మారెడ్డీ.! పవన్ కళ్యాణ్ మీద ‘పెద్ద’ మాటలొద్దు.!
‘మనం ఎప్పుడూ కలుసుకుంటూనే వుంటాం.. అది వాళ్ళకి తెలియదు కదా.. ఏవేవో అనుకుంటారు’ అని బాలయ్య చెప్పడమంటే.. అది మామూలు విషయం కాదు మరి.! హేట్సాఫ్ టు బాలయ్యా.!
ఈశ్వరా.. బాలేశ్వరా.. పవనేశ్వరా.! ‘ఆహా’ జన్మ ధన్యమైంది ఈ ఎపిసోడ్ పుణ్యమా అని.!