Pawan Kalyan Ustaad BhagatSingh.. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోయిందన్నారు. కానీ, ఆగలేదని తాజా ఫోటోలు ప్రూవ్ చేస్తున్నాయ్.
చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఫోటోల్ని అఫీషియల్‌గా విడుదల చేసింది. షూటింగ్ స్పాట్ నుంచి రిలీజైన ఈ ఫోటోలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయ్.
ఇంకేముంది.! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఇప్పట్లో లేనట్లే అని ఫ్యాన్స్ ఢీలా పడిపోయిన టైమ్‌లో హరీష్ అండ్ టీమ్ ఏం చేసిందో ఏమో కానీ, మళ్లీ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లింది సక్సెస్‌ఫుల్‌గా.
Pawan Kalyan Ustaad BhagatSingh.. ‘పవర్’ జోరు.. ఫ్యాన్స్ హుషారు.!
రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్‌లో చాలా వరకూ ఇంపార్టెంట్ సన్నివేశాల్ని చిత్రీకరించేయనున్నాడట డైరెక్టర్ హరీష్ శంకర్.

ఈ కాంబోకి వున్న క్రేజ్‌ని బట్టి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలున్నాయ్. అందులోనూ.. ‘ఈ సారి బాక్సాఫీస్ బద్దలైపోద్ది..’ అంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.
పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో. తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’కి ఇది రీమేక్‌గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
సెట్లో పవన్ కళ్యాణ్‌కి సన్నివేశాన్ని వివరిస్తున్న హరీష్ శంకర్.. ఖాకీ దుస్తుల్లో పవర్ ఫుల్ లుక్స్‌తో అలా నడిచొస్తున్న పవన్ కళ్యాణ్.. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారంటే అతిశయోక్తి కాదేమో.
Also Read : దివ్య భారతి బయోపిక్.! ఆ అందగత్తె ఎవరు.?
ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్. అన్నట్లు ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.