Table of Contents
Pawan Kalyan Vizag Rushikonda.. ఔను, జనంలో చైతన్యం పెరిగింది.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ పట్ల నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది.!
విశాఖలో అయితే ఇంకాస్త ఎక్కువగా.! వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్నంలో జనసేన పార్టీ అనూహ్య విజయాల్ని అందుకోనుందనేలా పరిస్థితులు మారుతున్నాయ్.!
ఒక్క యాత్ర.. ఒకే ఒక్క యాత్ర.. అదీ వారాహి విజయ యాత్ర.. విశాఖ ప్రజల్లో ఇంతటి మార్పుకి కారణమయ్యిందా.? అంటే, నిజానికి.. చాలా కారణాలున్నాయ్.!
ఈసారి మార్పు తథ్యం..
కొద్ది రోజుల క్రితం విశాఖ వెళ్ళినప్పుడు.. అక్కడ చాలామందితో మాట్లాడినప్పుడు, ఎక్కువ జనసేన ప్రస్తావనే వచ్చింది.
గతంలో ఇదే ఉమ్మడి విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోవడం పట్ల అక్కడి జనం కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అసలు పవన్ కళ్యాణ్ ఓడిపోతారని తాము అస్సలు ఊహించలేదనీ, ఎందుకలా జరిగిందో తమకు ఇప్పటికీ అర్థం కాలేదని వాళ్ళంతా చెబుతోంటే ఆశ్చర్యమేసింది.!
వారాహి విజయ యాత్రతో మారిన సీన్..
ఏమో, అప్పట్లో పైకి ఒకటి చెప్పి.. పోలింగ్ బూత్‌కి వెళ్ళాక ఇంకోలా చేశారేమో.. ఈసారి మాత్రం అలా జరగదు.. అన్న మాట పదిలో, తొమ్మిది మంది నుంచి వినిపించింది.
ఇతర పార్టీల సంగతేంటి.? అని ప్రశ్నిస్తే, ‘చూశాం, చూస్తున్నాం.. వాటి గురించి ఏం మాట్లాడతాం.?’ అన్న ప్రశ్న అట్నుంచి వచ్చింది.
రాజకీయమంటే జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది కొందరికి. విశాఖ, దేశంలోనే ప్రత్యేకమైన నగరం.
Pawan Kalyan Vizag Rushikonda.. చిన్నపాటి మెరుగులు దిద్దితే..
అలాంటి విశాఖ నగరానికి చిన్నపాటి మెరుగులు దిద్దితే చాలు విశ్వనగరంగా మారుతుంది. కానీ, ఆ చిత్తశుద్ధి గత పాలకుల్లోగానీ, ప్రస్తుత పాలకుల్లోగానీ లేదు.
గతంలోనూ.. ఇప్పుడూ.. భూముల దోపిడీ నిర్లజ్జగా జరుగుతుండడంపై విశాఖ వాసులు తీవ్ర అసహనంతో వున్నారు. ప్రధానంగా ‘గంజాయి మత్తు’ విశాఖ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

‘అయినా, విశాఖకు రక్షణగా నిలుస్తున్న కొండల్ని నాశనం చేయడమేంటి.? ప్రభుత్వంలో వున్నవారు చేయాల్సిన పనేనా.?’ అంటూ రుషికొండ విషయమై సగటు విశాఖ వాసి మండిపడుతున్నాడు.
మొత్తమ్మీద, విశాఖలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.! కానీ, ఎన్నికల వేళ ఓటర్లను ఎలాంటి తాయిలాలు, ప్రలోభాలు ఎలా మార్చుతాయో చెప్పలేం.!
Also Read: ఎకరం వెయ్యి కోట్లు! నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ!
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. విశాఖ నగరానికి రక్షణ కవచాలుగా వున్నాయి అక్కడి కొండలు.. వాటిల్లో రుషికొండ కూడా ఒకటి. అలాంటి రక్షణ కవచాల్ని ఇలా తొలిచేయడం వెనుక ఏ కుట్ర దాగి వుంది.?
పాలకులంటే ప్రజలకు రక్షకులుగా వుండాలి.. ఇలా భక్షకులుగా మారితే ఎలా.?