Pawan Kalyan Slippers Tribals.. గిరిజనం.. చెప్పులు వేసుకోలేదు.! అందరూ కాదు గానీ, మెజార్టీ గిరిజనం చెప్పుల్లేకుండానే జీవనం సాగిస్తున్నారు.
ప్రమాదకరమైన ముళ్ళు గుచ్చుకుంటున్నాయ్.. విష కీటకాల బారిన పడుతున్నారు.. ఇలా బోల్డన్ని ప్రాణాలు పోతున్నాయ్. ఏళ్ళ తరబడి నడుస్తున్న ప్రసహనం ఇది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటీవల గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు, చెప్పుల్లేకుండా కష్టాలు పడుతున్న మహిళల్ని చూశారు.
ఆ తర్వాత, వారికి చెప్పులు ఇప్పించేలా అధికారుల్ని ఆదేశించారు పవన్ కళ్యాణ్. గిరిజన ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, గిరిజనుల కాళ్ళ పాదాల సైజు తెలుసుకుని, వారికి చెప్పుల్ని అందించారు.
Pawan Kalyan Slippers Tribals.. గిరిజనం మనసెరిగిన జనసేనాని..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ స్టంట్లు చేశారనీ.. గిరిజనులకు కొనుగోలు చేయగల స్థోమత వున్నాగానీ, వారి ఆచార వ్యవహారాల్లో భాగంగా చెప్పులు వేసుకోరనీ.. రకరకాల ప్రచారాలు తెరపైకొచ్చాయ్.
ఏది నిజం.? ఆచార వ్యవహారాలు నిజం. కానీ, కాలం మారింది. అనారోగ్య సమస్యలు.. ప్రధానంగా డయాబెటిస్, గిరిజన ప్రాంతాల్లోనూ విస్తరించింది. దాంతో, వాళ్ళూ చెప్పులు ధరిస్తున్నారు.
అయితే, ఆర్థిక పరిస్థితులు సహకరించడంలేదు.. రోడ్లు లేవు సరికదా, కనీసం నడక మార్గాలు కూడా సరిగ్గా వుండవు. చెప్పులతో నడవడం ఇబ్బందికరంగా వుంటుంది.
చెప్పుల్లేకుండా నడవడమూ కష్టమే.. కానీ, తప్పని పరిస్థితి. దశాబ్దాలుగా సరైన రోడ్లు లేక, రోడ్లు అంటే ఏంటో కూడా తెలియక ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు మంచి రోజులొచ్చాయ్.
మురిసిపోతున్న గిరిజనం..
రోడ్లు వస్తున్నాయ్.. కాళ్ళకు చెప్పులూ వస్తున్నాయ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమ కష్టాల్ని గుర్తెరిగి, కాళ్ళకు చెప్పుల్ని అందించినందుకు గిరిజనం మురిసిపోతున్నారు.
షరామామూలుగానే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి గిరిజనులు బ్రహ్మరథం పట్టడాన్ని ఓ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పవన్ కళ్యాణ్ మీద దుష్ప్రచారానికి తెరలేపింది.
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా గిరిజనులకు రోడ్లెయ్యలేకపోవడంపై ఆత్మ విమర్శ చేసుకుని, ఆ తర్వాత ఎవరైనా పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తే బావుంటుంది.
Also Read: హింసకీ, రక్త పాతానికీ.. గ్రామర్ వుంటుందా నానీ.?
రాజకీయమంటే ప్రజా సేవ.. ఇది జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నమ్మిన సిద్దాంతం.!
కొందరికి రాజకీయమంటే ఓ వృత్తి.. అందులో ఆర్జనకు అలవాటుపడ్డారు.. ప్రజా ధనాన్ని దోచుకోవడమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు.
అలాంటివాళ్ళకి పవన్ కళ్యాణ్ చేసే ప్రజా సేవ గిట్టకపోవడంలో వింతేముంది.?