Pawan Kalyan Yajnopaveetam Jandhyam.. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అనాచ్ఛాధిత ఛాతీ భాగాన్ని పవన్ కళ్యాణ్ ప్రదర్శించాల్సి వచ్చింది. ప్రదర్శించడమేమీ కాదు, చొక్కా తీసి పుణ్య స్నానం ఆచరించారంతే.
అలా, పుణ్య స్నానం ఆచరించే క్రమంలో ఆయన ధరించిన ‘జంద్యం’ అందరికీ కనిపించింది.
‘పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అంటే శూద్రుడు. సో, శూద్రుడు ఎలా జంద్యం ధరిస్తాడు.?’ అన్న ప్రశ్న తెరపైకొచ్చింది.
Pawan Kalyan Yajnopaveetam Jandhyam.. జంద్యం.. యజ్ఞోపవీతం..
సాధారణంగా జంద్యాన్ని బ్రాహ్మణులు ధరిస్తారు. జంద్యాన్ని యజ్ఞోపవీతం అని కూడా అంటారు.! బ్రాహ్మణులు మాత్రమే కాదు, పలు ఇతర కులాలకు చెందినవారూ జంద్యాన్ని ధరిస్తారు.
జంద్యాన్ని ధరించాలంటే, ఉపనయనం జరగాలి. ఈ ఉపనయనం అనేది కొన్ని సామాజిక వర్గాల్లో ఆయా సంప్రదాయాల ప్రకారం జరుగుతుంటుంది.

యజ్ఞోపవీతం ఫలానా వాళ్ళే ధరించాలన్న ‘నిబంధన’ ఎక్కడా లేదు.! ఖచ్చితంగా యజ్ఞోపవీతాన్ని ధరించే నిబంధన వున్న కులాల్లో కూడా, కొందరు ధరించరు.
దైవ కార్యాలు.. అందునా, యజ్ఞ యాగాదులు ఎక్కువగా నిర్వహించేవారు, భక్తి భావం మెండుగా వున్నవారెవరైనా జంద్యాన్ని ధరించొచ్చు.
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించారు. దాంతో, ఆయన యజ్ఞోపవీతాన్ని ధరించడంలో వింతేమీ లేదు. నిజానికి, ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నారు.
నియమ నిష్టలు.. పవన్ కళ్యాణ్‌కి అలవాటే.!
చాతుర్మాస దీక్షలు.. వంటి వాటిని అత్యంత నియమ నిష్టలతో ఆయన చేస్తుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. సో, పవన్ కళ్యాణ్ యజ్ఞోపవీతం ధరించడాన్ని ఆక్షేపించాల్సిన అవసరమే లేదు.
స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా పవన్ కళ్యాణ్‌కి ఉపనయనం జరిగి వుండొచ్చన్నది ఓ వాదన.
కాదేదీ వివాదానికి అనర్హం.. అన్న చందాన, పవన్ కళ్యాణ్ జంద్యాన్ని ధరించడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోందంతే. పనీ పాటా లేని కొందరు చేసే ఈ రచ్చని పట్టించుకోవడం అనవసరం.!
Also Read: సమీక్ష: ‘ఆరెంజ్’! అప్పట్లో డిజాస్టర్! ఇప్పుడేమో వసూళ్ళ ప్రభంజనం!
ఇదిలా వుంటే, మహా కుంభ మేళాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుణ్య స్నానంపై జుగుప్సాకరమైన ట్రోలింగ్ జరుగుతోంది. దానిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఫిర్యాదుల నేపథ్యంలో కేసులు నమోదవుతున్నాయి కూడా. పవన్ కళ్యాణ్ యజ్ఞోపవీతం ధరించడంపైన జరుగుతున్న ట్రోలింగ్.. అలాగే, పవన్ కళ్యాణ్ మీద బాడీ షేమింగ్ కూడా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పకపోవచ్చు.