రాజకీయాల్లో విమర్శలు లేకపోతే ఎలా.? ప్రజాసేవ అనే విషయాన్ని నాయకులు ఎప్పుడో మర్చిపోయారు. ప్రత్యర్థుల మీద ఆధిపత్య పోరునే (Pawan Kalyan Ys Jagan) రాజకీయం అనుకుంటున్నారు.
అసలు విషయానికొస్తే, జనసేన పార్టీని రౌడీ సేనగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారిక పర్యటన నిమిత్తం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. రాజకీయ విమర్శలేవీ చేయకుండా తిరిగి వెళ్ళారు.
తెలంగాణ రాష్ట్రానికీ వచ్చారు ప్రధాని మోడీ. తెలంగాణ రాష్ట్ర సమితిపై రాజకీయ విమర్శలు చేశారు. పార్టీ వేదికలపై రాజకీయ విమర్శలు చేయడాన్ని తప్పు పట్టలేం.
Pawan Kalyan Ys Jagan ఎవరు పొలిటికల్ రౌడీ.?
నర్సాపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజకీయ విమర్శలు చేశారు. అదీ అధికారిక పర్యటన సందర్భంగా. సరే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే అయిపోయాయనుకోండి.. అది వేరే సంగతి.
వైఎస్ జగన్ చేసిన విమర్శలపై జనసేన అధినేత స్పందించలేదంటూ ఓ వర్గం మీడియా తెగ బాధపడిపోయింది. వారి బాధని చల్లార్చుతూ పవన్ కళ్యాణ్ ఓ కార్టూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన కోసం భారీగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. సెక్యూరిటీ ప్రోటోకాల్ సహా, పలు ఏర్పాట్ల నిమిత్తం లక్షల్లోనే ఖర్చయి వుంటుంది.
సొమ్ములెవరివి.? సోకులెవరివి.?
కానీ, పవన్ కళ్యాణ్ చాలా సింపుల్గా ఓ కార్టూన్ వేసేసి ఊరుకున్నారు. ‘వైసీపీ నేతలు దొంగలు, రౌడీలు, గూండాలు.. ఆ ముఠాకి బాస్ వైఎస్ జగన్’ అని అర్థం వచ్చేలా ఈ కార్టూన్ రూపొందింది.
వైఎస్ జగన్ అంత కష్టపడి, అధికారిక వేదికపైనుంచి జనసేన మీద ‘రౌడీ సేన’ అని విమర్శలు చేస్తే, పవన్ కళ్యాణ్ అంతకు మించిన ఇంపాక్ట్ వచ్చేలా కార్టూన్ వదిలారు.
Also Read: రిషి సునాక్ మనోడేనా.? బాబోయ్ ఏమి ‘కుల’జాడ్యమిది.!
ఇక్కడ, ఈ విషయంలో ఎవరిది పైచేయి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
చివరగా.. ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు చేయకుండా వుండడం కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తుల బాధ్యత.