Pawankalyan Balakrishna Multistarrer.. తెలుగు సినీ పరిశ్రమలో మల్టీస్టారర్లు కొత్త కాదు.! కానీ, ఎందుకో మల్టీస్టారర్ సినిమాల విషయంలో ప్రతిసారీ పెద్ద రచ్చ జరుగుతూ వస్తోంది. కొన్ని కాంబినేషన్లు వర్కవుట్ కావడంలేదు.!
‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో అయితే.. ఎంత పెద్ద హిట్టయినాగానీ, ‘ఎవరు గొప్ప.?’ అన్న అంశం చుట్టూ కొందరు దురభిమానులు నానా యాగీ చేస్తూనే వున్నారు.
స్వర్గీయ ఎన్టీయార్‌తో మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించారు..
యంగ్ టైగర్ ఎన్టీయార్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేశారు..
నందమూరి బాలకృష్ణ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే..
ఎవరికి ‘గొడ్డలి వేటు’ (అదేనండీ గుండె పోటు).?
Mudra369
తెరపై రామ్ చరణ్ – ఎన్టీయార్ కలిసి ‘నాటు నాటు’ డాన్స్ వేస్తోంటే.. ఆ కిక్కే వేరప్పా.. అనుకున్నారు సాధారణ సినీ అభిమానులు. కొందరు దురభిమానులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు.
Pawankalyan Balakrishna Multistarrer.. బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్
ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షో సందర్భంగా మల్టీస్టారర్ ప్రస్తావన తెచ్చారు హోస్ట్ బాలకృష్ణ.. అదీ పవన్ కళ్యాణ్ వద్ద. కథ చెప్పడానికి తాను రెడీ.. అంటూ దర్శకుడు క్రిష్ ప్రకటించేశాడు.

అది చూశాక, ఈ కాంబినేషన్ త్వరగా సెట్స్ మీదకు వెళితే బావుణ్ణని చాలామంది సినీ అభిమానులు అనుకున్నారు. తెరపై ఇద్దరు పెద్ద స్టార్స్‌ని చూస్తే అభిమానులకు వచ్చే ఆ కిక్కే వేరప్పా.!
అయితే, ‘బాలకృష్ణ దేబిరింపు’లా కొందరికి కనిపించింది. పైశాచికత్వం.. అంటారు కదా, అదే ఇది.!
అడిగితే తప్పేముంది.?
హోస్ట్ సీటులో వున్న బాలకృష్ణ గెస్ట్ సీటులో వున్న పవన్ కళ్యాణ్‌ని ‘మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దాం భయ్యా.? 2024లో చేసేద్దాం..!’ అని అంటే, అందులో తప్పు పట్టడానికేముంటుంది.?
Also Read: ‘కశ్మీర్ ఫైల్స్’ చెత్త.! ప్రకాష్ రాజ్.. పిచ్చి మొరుగుడు.!
కోడి గుడ్డు మీద ఈకలు పీకడానికి కొందరు రెడీగా వుంటారు. అదే జరిగింది ఇక్కడ కూడా.!
చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అంటారు.. పవన్ కళ్యాణ్‌ని దేబిరిస్తున్న బాలకృష్ణ అంటారు.! ఇలా పైశాచికానందం పొందుతున్నవాళ్ళని ఏమనాలి.? దీన్ని మానసిక రోగమని కాక ఇంకేమనాలి.?