Pawankalyan On AHA Unstoppable.. ఓ టాక్ షో.. అందునా, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే టాక్ షో.. దీనికోసం లక్షలాది మంది, కోట్లాది మంది ఎదురుచూడటం.. అదీ కనీ వినీ ఎరుగని స్థాయిలో.. చిన్న విషయమేమీ కాదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ వుంది. ‘ఆహా’ వేదికగా అన్‌స్టాపబుల్ టాక్ షో కోసం చాలామంది సినీ ప్రముఖులే వచ్చారు. అందరిదీ ఓ లెక్క.. పవన్ కళ్యాణ్‌ది ఇంకో లెక్క.!
Pawankalyan On AHA Unstoppable.. భారీ కటౌట్లు.. పోటెత్తుతున్న ట్వీట్లు..
ఆషామాషీ కటౌట్లు కాదు.. కొత్త సినిమా రిలీజ్‌ని తలపించేలా భారీ కటౌట్లు పలు చోట్ల ఏర్పాటయ్యాయి.
అన్‌స్టాపుబల్ హోస్ట్ బాలకృష్ణ (Nandamuri Bala Krishna).. అన్‌స్టాపబుల్ గెస్ట్ పవన్ కళ్యాణ్ కటౌట్లు.. ఆయా ప్రాంతాల్లో జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక, ట్వీట్ల విషయానికొస్తే.. వందల్లో, వేలల్లో కాదు.. లక్షల్లో పడుతున్నాయ్.! అది చూసి ఓర్వలేనివారు వేసే నెగెటివ్ ట్వీట్ల హంగామా కూడా మామూలుగా లేదు.
ఏం ముచ్చటించుకుంటారోనని..
ఇద్దరూ కేవలం సినీ నటులు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా. అందుకే ఈ ఉత్కంఠ జనాల్లో. తెలుగు రాష్ట్రాల్లో ఈ కాంబినేషన్ గురించి అనూహ్యమైన రీతిలో చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి బాలయ్య సంధించే ప్రశ్నలు.. వాటికి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే సమాధానాలు.. ఇద్దరి మధ్యా నడిచే హ్యూమరస్ ట్రాక్.. వీటి గురించి ముందే జనానికి ఓ ఐడియా వచ్చేసింది.
Also Read: బండ్ల గణేష్ సూక్తులు.! ఎవర్ని ఉద్దేశించి చెప్మా.?
మొత్తమ్మీద, ఓటీటీ చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ లేనంత హంగామా ‘అన్‌స్టాపబుల్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ’ఎపిసోడ్ చేయబోతోందన్నమాట.
అన్నట్టు, కొన్ని సినిమా థియేటర్లలో కూడా ఈ ఎపిసోడ్‌ని అభిమానుల కోసం స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేయడం గమనార్హం.
సర్వర్లు కుప్ప కులిపోతాయో.. ఇంకేమన్నా అవుతాయో.. జస్ట్ వెయిట్ అండ్ సీ.!