Tripti Dimri: ‘యానిమల్’ భామ.. టాక్ ఆప్ ది టౌన్.!

Tripti Dimri
Tripti Dimri Animal Movie.. ఎవరీ త్రిప్తి దిమ్రి.? ‘యానిమల్’ సినిమా పుణ్యమా అని రాత్రికి రాత్రి తెలుగు నాట సంచలనంగా మారిపోయింది ఈ బ్యూటీ.!
బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. అయితే, ‘యానిమల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయమైందంతే.!
‘యానిమల్’ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్.! రష్మిక (Rashmika Mandanna) గురించి బోల్డంత పబ్లిసిటీ జరిగింది.! ఆమె మీద ట్రోలింగ్ సంగతి సరే సరి.!
Tripti Dimri Animal Movie.. ఒక్క సినిమాతోనే.. సెన్సేషనల్ ఫాలోయింగ్..
కానీ, అనూహ్యంగా తృప్తి దిమ్రి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సినిమాల్లో ఆమె గ్లామరస్ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ త్రుప్తి దిమ్రి వెంట, పలువురు టాలీవుడ్ హీరోలు పడుతున్నారంటూ గాసిప్స్ కూడా షురూ అయ్యాయ్. సోషల్ మీడియాలోనూ తృప్తి దిమ్రి పేరు మార్మోగిపోతోంది.

మాస్ మహరాజ్ రవితేజ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటించబోతోందన్నది ఆ గాసిప్స్‌లో ఒకటి.! ఈ కాంబినేషన్ నిజమవుతుందా.? అంటే, అది ప్రస్తుతానికి సస్పెన్స్.
రవితేజ సినిమాల్లో ఈ మధ్య ఎక్కువగా కొత్త భామలు కనిపిస్తున్నారు. ఆ లెక్కన, తృప్తి దిమ్రికి రవితేజ సరసన నటించే ఛాన్స్ నిజంగానే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
అన్నట్టు, రవితేజ సినిమాలతో పరిచయమవుతున్న కొత్త హీరోయిన్లు ఎవరూ ఆయా సినిమాలతో హిట్స్ అందుకోలేకపోతున్నారనుకోండి.. అది వేరే సంగతి.!
టాలీవుడ్ పిలుస్తోంది..
తాను బాలీవుడ్‌కి మాత్రమే పరిమితం కాదలచుకోలేదనీ, మంచి అవకాశాలొస్తే సౌత్‌లోనూ నటిస్తానని అంటోంది తృప్తి దిమ్రి. ఆమె ‘సై’ అనాలేగానీ, టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తకుండా వుంటాయా.? ఏంటి.?
Also Read: Lavanya Tripathi: కొత్త పెళ్ళికూతురి ‘లావణ్యం’.!
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ – రష్మిక మండన్న జంటగా నటించిన ‘యానిమల్’ సినిమాలో అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం విదితమే.
బోల్డన్ని విమర్శలు ఈ ‘యానిమల్’ (Animal Movie) సినిమా మీద ఇప్పటికే వినిపించినా, కమర్షియల్‌గా బాగానే వర్కవుట్ అవుతోంది.
