Pawankalyan Saidharam Tej Song.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ అట.! అదేనండీ, ‘వినోదియ సితం’ సినిమా రీమేక్ రాబోతోంది కదా.!
సినిమా లాంఛనంగా ప్రారంభమై వారం కూడా తిరగలేదు.. అప్పుుడే స్పెషల్ సాంగ్‌కి సంబంధించిన గాసిప్స్ షురూ అయ్యాయ్.
ఒరిజినల్ వెర్షన్‌లో పాటల్లేకపోతే, రీమేక్ సినిమాలో కనీసం స్పెషల్ సాంగ్ కూడా పెట్టకూడదా.?
తెలుగు సినిమా లెక్కలు వేరు.. ఇక్కడి అభిమానుల అంచనాలు వేరు.!
కమర్షియల్ అనలేంగానీ, కంప్లీట్ ప్యాకేజీగా సినిమా వుంటే.. ఆ కిక్కే వేరప్పా.! టాలీవుడ్‌లో ఆ మార్పుల కథే వేరప్పా.!
Mudra369
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో మేనమామ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
Pawankalyan Saidharam Tej Song.. స్పెషల్ సాంగ్ అలా వుంటుందట..
స్పెషల్ సాంగ్ అంటే.. బాలీవుడ్ హిట్ సాంగ్ ‘కజరారే’ గుర్తుంది కదా.? అలా వుంటుందట. అదే, అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి చేసిన పాట అది. అందులో ఐశ్వర్యార్ ఆడిపడింది.
ఇక, పవన్ – సాయిధరమ్ తేజ్ కోసం ఏ బ్యూటీని దించబోతున్నారబ్బా.? అంటూ చాలా పేర్లతో బోల్డన్ని పుకార్లు షికార్లు చేసేస్తున్నాయ్.

పూజా హెగ్దే, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్.. ఇలా రాసుకున్నోడికి రాసుకున్నంత. రష్మిక కూడానట.! సరిపోయింది సంబరం.!
వుంటే తప్పేంటి.?
స్పెషల్ సాంగ్ వుంటే తప్పేంటి.? ఒరిజినల్‌లో లేకపోతే.. రీమేక్ సినిమాలో వుండకూదన్న రూల్ ఏమైనా పెట్టారా.?
Also Read: Regina Cassandra: ఈ ఓటీటీ విడాకులేంటమ్మా.?
తెలుగు సినిమా వేరు.. ఇక్కడి కమర్షియల్ ఆలోచనలూ వేరు. అన్నిటికీ మించి, తెలుగు సినీ అభిమానుల టేస్ట్ వేరు.!
సినిమా లాంఛనంగా ప్రారంభమైందంతే. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళాలి.. బోల్డంత కథ వుంది.! అన్నట్టు, త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచనా సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే.