Payal Rajput Against Nepotism.. పాయల్ రాజ్‌పుత్ తెలుసు కదా.? ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ మధ్యన ‘మంగళవారం’ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
సక్సెస్, ఫెయిల్యూర్‌కి అతీతంగా, సినిమా ఛాన్సులు బాగానే వచ్చాయి పాయల్ రాజ్‌పుత్‌కి. అయినాసరే, ఎక్కువగా గ్లామరస్ రోల్స్‌కే పాయల్ రాజ్‌పుత్‌ని దర్శక నిర్మాతలు పరిమితం చేశారు.
ఏమయ్యిందోగానీ, సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆసక్తికరమైన ట్వీట్ చేసింది పాయల్ రాజ్‌పుత్.. ‘స్ట్రగుల్ ఈజ్ రియల్’ అని పేర్కొంటూ.
Payal Rajput Against Nepotism.. అంత వీజీ కాదుగానీ..
సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదనీ, నిలదొక్కుకోవడం చాలా కష్టమైన వ్యవహారమనీ పాయల్ రాజ్‌పుత్ తన ట్వీటులో పేర్కొంది.
నెపోటిజం, ఫేవరెటిజం ముందు టాలెంట్ ఓడిపోతోందని పాయల్ రాజ్‌పుత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పేరు చివర్న తోకలకు మాత్రమే గుర్తింపు లభిస్తోందనీ వాపోయింది.

అసలేమయ్యింది పాయల్ రాజ్‌పుత్‌కి.? ఎందుకింతలా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఏదన్నా సినిమాలో ఆమె అవకాశాన్ని ఇంకెవరైనా లాగేసుకున్నారా.?
నెపోటిజం సినీ పరిశ్రమలోనే కాదు, అన్ని రంగాల్లో వుంటుందన్నది బహిరంగ రహస్యం. ఆ నెపోటిజం ప్రభావం, టాలెంట్ వున్నవారి మీద కొంత ప్రభావం చూపడమూ మామూలే.
బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళు కూడా..
అయితే, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని వారు కూడా, సినీ పరిశ్రమలో రాణిస్తుంటారు. సక్సెస్, ఫెయిల్యూర్.. ఇవే కదా ఏ నటి అయినా, నటుడి కెరీర్‌ని డిసైడ్ చేసేది.?

అదే సమయంలో, పాయల్ రాజ్‌పుత్ ఆవేదనలోనూ అర్థం లేకపోలేదు. ఏదో గట్టి దెబ్బ తగిలి వుంటేనే, ఇంతలా ఆమె ఆవేదన వ్యక్తం చేసి వుంటుంది.
Also Read: కుక్క పని కుక్కే చెయ్యాలి.! గాడిద చెయ్యకూడదు.!
ఇంతకీ, పాయల్ రాజ్‌పుత్‌కి వచ్చిన కష్టమేంటి.? ఆమె ఛాన్సుల్ని లాక్కున్న ఆ నెపోకిడ్స్ ఎవరు.?