Pegasus Telugu Politics ఇనేటోడు ఎర్రి ఫ్లవర్ అయితే, సెప్పేటోడు యాండీ ఫ్లవర్.. అన్నాడట ఎనకటికొకడు.
అదేదో, పెగాసస్ అట. అదొక స్పైవేర్ అట. ఆడెవడో ఇజ్రయెలోడు దాన్ని కనిపెట్టాడట. అదేంటో తెల్వదు కానీ, సేలా మందికి అదిప్పుడో హాట్ టాపిక్ అయిపోయింది.
ఎందుకో తెలుసా.? పనీ పాటా లేనోళ్లు ఖాళీగా కూసుని తిట్టుకోవడానికి తప్ప, ఈ పెగాసస్ సొల్లు వల్ల పైసా ప్రయోజనమే లేదు. ఆడెవడో కొన్నాడట.. ఈడెవడో మొరుగుతున్నాడట.
ఆడు కొన్నది నిజమైతే, ఈడు సాక్ష్యాలు సూపెట్టాలి కదా.. ఈడికేమో అది సేతకాదు. ఆడి మీద పడేడ్డమే ఈడి పని. ఈడు సేతకానోడని ఆడికి తెలుసు. ఆడిని పట్టుకోలేని అసమర్ధున్నని ఈడికీ తెలుసు.
Pegasus Telugu Politics సిల్లీ రాజకీయమ్.!
ఇలా ఇద్దరు ఎర్రి ఎంగళప్పలు రోడ్డున పడి కొట్టుకుంటున్నారు. ఏసీ రూముల్లో కూసుని మొరుగుతున్నారు. ఏందిరా ఈళ్ల వల్ల పయోజనం.? ఈ కొట్టుకొనుడు, తిట్టుకొనుడు యవ్వారంతో పజానీకానికి సత్తు పైసా ఉపయోగమేటీ.?
సవ్వాలే లేదు. శవ రాజకీయమైనా పెగాసస్ రాజకీయమైనా.? ‘అది’ వున్నా లేకున్నా.. రొచ్చు రొచ్చుగా రచ్చ చేయాల్సిందే. పెజలు పెద్దరికమిస్తే పందుల్లా రాజకీయమనే బురదలో పడి దొర్లుతున్నారంతే.
Also Read: అనసూయ ‘ఉవాచ’.! హ్యాపీ ఫూల్స్ డే.!
ఛీ ఛీ.! ఈళ్లని పందులతో పోల్చమనకండి. ఆ పందులు కూడా సిగ్గు పడతాయ్. అంతలా సిగ్గొదిలేశారు. నవ్విపోదురు గాక ఆళ్లకేటి సిగ్గు.?
ముఖ్య గమనిక: ఈడెవడో ఆడెవడో అని ఎవడెవడినో ఊహించుకోమాకండి. ఎవ్వడినీ ఉద్దేశించింది కాదిది. ఎవ్వడైనా ఆడికాడు ఊహించుకుంటే, సేసేదేంలే.!