Police Constable Wife.. అసలు ఇది కూడా ఓ వార్తేనా.? ఓ కానిస్టేబుల్, పుట్టింట్లో వుండిపోయిన తన భార్యతో మాట్లడేందుకు, ఆమెను బుజ్జగించేందుకు ఉన్నతాధికారులకు లీవ్ లెటర్ రాశాడు.!
ఎందుకు వార్త కాకూడదు ఇది.? భార్యల్ని వేధించే భర్తలే కాదు.. భర్తల్ని రాచి రంపాన పెట్టే భార్యలూ వున్నారు ఈ సమాజంలో.!
ఏడ్చే మగాడ్ని నమ్మకూడదంటారు.. అందుకే, మగాడి ఏడుపుకు విలువ లేకుండా పోయింది. నవ్వే ఆడదాన్నీ నమ్మకూడదంటారు.. ఆ ఆడదాని నవ్వుని వర్ణిస్తూ లక్షలు, కోట్లాది కవితలున్నాయ్.
Police Constable Wife.. పోలీసోడేగానీ భార్యా బాధితుడు..
జనాల తాట తీసే పోలీసుల్లోనూ కొందరు అత్యంత సున్నిత మనస్కులుంటారు.! అలాంటోడే ఈ పోలీస్. ఉత్తర ప్రదేశ్‌లోని మహరాజ్ గంజ్ జిల్లాలో జరిగిన ఘటన అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
భార్యను బుజ్జగించుకునేందుకు తనకు అవకాశం కల్పించాలనీ, సెలవు ఇప్పించాలనీ ఉన్నతాధికారులకు గౌరవ్ చౌదరి అనే కానిస్టేబుల్ రాసిన లేఖ సోషల్ మీడియాకి లీక్ అయ్యింది.
అంతే, క్షణాల్లో ఈ లేఖ వైరల్‌గా మారింది. ఎవరీ గౌరవ్ చౌదరి.? అని అంతా ఆరా తీస్తున్నారు. మరోపక్క, ఉన్నతాధికారులకు కానిస్టేబుల్ రాసిన లేఖ ఎలా లీక్ అయ్యిందో తెలియక పోలీస్ శాఖ తలపట్టుక్కూర్చుంది.
భార్య ఎందుకు అలిగింది.?
ఇంతకీ, గౌరవ్ చౌదరి మీద అతని భార్య ఎందుకు అలిగింది.? ఫోన్ చేసినా ఎందుకు ఆమె అతనితో మాట్లాడటంలేదు.?
పెళ్ళయి ఏడాదే అయ్యిందట. ఇంతలోనే పుట్టింటికి పంపించాడట తన భార్యని గౌరవ్ చౌదరి. ఆమెని తిరిగి తీసుకురావడానికి మీనమేషాల్లెక్కించాడట.
Also Read: Chepala Pulusu: అనగనగా ఓ చేపల పులుసు.!
అంతే కాదు, అక్కడ ఏదో శుభకార్య వుంటే, వెళ్ళలేదట. పనిచూసుకుని వచ్చెయ్యమని సలహా ఇచ్చాడట. దాంతో, ఆమెకు ఒళ్ళు మండి.. టార్చర్ షురూ చేసిందట.
ఉన్నతాధికారులు ఫాఫం ఈ కానిస్టేబుల్ కష్టాన్ని అర్థం చేసుకుని లీవ్ మంజూరు చేశారట కూడా. సో, భార్యని బతిమాలుకునేందుకు అవకాశం దొరికిందన్నమాట.
అంతేనా ఇంకేమైనా వుందా.? ప్రస్తుతానికైతే ఇంతే.! ఈ కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో మరి.!