Political Animals.. ఒకాయన తాను సింహాన్నంటాడు.! ఇతరుల్నేమో తోడేళ్ళంటాడు.! రాజకీయాల్లో సింహాలు, తోడేళ్ళ గోలేంటి.?
సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయ్.. అంటూ ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగ్ అప్పట్లో పెద్ద హిట్టు.
దాన్ని రాజకీయాల్లో విచ్చలవిడిగా వాడెయ్యడం చూస్తూనే వున్నాం. అది చాలక, సింహం.. తోడేళ్ళు.. అంటూ కొత్త ప్రస్తావన తెరపైకొచ్చింది.
అసలు రాజకీయాల్లో జంతువులకు ఛాన్స్ లేదు. అది సింహమైనా, తోడేలు అయినా.. ఇంకోటైనా.!
Political Animals.. జనానికి కావాల్సిందేంటి.?
రాజకీయ నాయకులు కోట్లు గడిస్తునన్నారు.! ప్రజలేమో ప్రభుత్వాలిచ్చే సంక్షేమ పథకాల కోసం ఎగబడాల్సి వస్తోంది.
కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో.. జనాన్ని తినేసే క్రూర జంతువులు రాజకీయాల్ని ఏలుతున్న రోజులివి.!
ఇందులో మళ్ళీ.. పులులు, సింహాలు, పందులు, కుక్కలు, తోడేళ్ళంటూ ఇదొక వింత గోల.!
Mudra369
కామెడీ ఏంటంటే, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రజలు, ఆ సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వాలు చేసే అప్పులకు పన్నుల రూపంలో వడ్డీలు కట్టాల్సి రావడం.
Also Read: Vande Bharat Express: టిక్కెట్టు లేకపోతేనేం ట్రెండ్ సెట్ చేశాడంతే.!
సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమేనా ‘సింహం’ తాలూకు లక్షణం.? అన్న ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు.?
ప్రశ్నించాల్సింది ప్రజలు.! ఎందుకంటే, వాళ్ళే బాధితులు గనుక. మార్పు ప్రజల నుంచి వస్తే తప్ప.. రాజకీయాల్లో ఈ జంతువుల గోల ఆగదు.