ఆ విష పురుగు (Political Backstabbing Toxic Creatures) తనను తాను ఓ మేధావిగా చెప్పుకుంటుంటుంది. చెప్పుకోవాలి మరి, లేదంటే ఎవడూ లెక్క చేయడు. ఆ కొంప గుమ్మం దగ్గర, ఈ కొంప గుమ్మం దగ్గర దేబిరిస్తే, నాలుగు ఎంగిలి మెతుకులు దొరుకుతాయ్. వాటితో కడుపు నింపుకుని, కొందరి చేతుల్లో కీలు బొమ్మలా వ్యవహరిస్తూ, ఇంకొందరి మీద విషం చిమ్మడమే ఆ విష పురుగు పని.
ప్రజారాజ్యం పార్టీ మీద విషం చిమ్మే ప్రయత్నంలో, తన నంగనాచి నైజం బయటపెట్టేసుకుందా విష పురుగు. చిరంజీవి ఎమ్మెల్యే అవడం ఆగిందా.? చిరంజీవి కేంద్ర మంత్రి అవడం ఆగిందా.? ఆ పురుగెంత.? దాని బతుకెంత.? చివరికి బొచ్చెలో సలహాదారు పదవి పడేస్తే, ఆ ఎంగిలి మెతుకులతో కొన్నాళ్ళు అలాగే పడి వుందది.
మళ్ళీ ఇప్పుడు దాని గొంతు పెగులుతోంది. బహుశా యజమాని ‘ఉస్కో’ అని వుంటాడు. ఈసారి ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తెస్తూనే, ప్రస్తుత జనసేన పార్టీ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందా విషపు పురుగు. ఓ సుత్తి, ఓ ఛీ ఛెడ్డీ.. అలాగే, ఈ విష పురుగు కూడా. వీటికి వేరే పనేమీ వుండదు. మెగా కాంపౌండ్ మీద పడి ఏడవడం తప్ప.
ఇలాంటి విష పురుగుల వల్ల చిరంజీవికో, పవన్ కళ్యాణ్‌కో నష్టం జరుగుతుందనుకుంటే పొరపాటే. వాళ్ళు మార్పు తీసుకురావాలనుకుంటున్న సమాజానికి నష్టం జరుగుతుంది. ఔను, ఎవరైతే తమలాంటి భజనపరుల్ని పెంచుతారో, ఎవరైతే తమకు ఎంగిలి మెతుకులు వేస్తారో.. అలాంటివారి కోసమే ఈ విషపు కీటకాలు.. దీపం పురుగుల వలె పని చేస్తుంటాయ్.
అభిమానులంటే చిరంజీవికైనా, పవన్ కళ్యాణ్‌కైనా, మెగా కాంపౌండ్‌లో మరే ఇతర హీరోకైనా బలమే తప్ప, బలహీనత కాదు. ఆ అభిమానుల్ని రెచ్చగొట్టడం ద్వారా, సోషల్ మీడియాలో సెలబ్రిటీలైపోదామని సోకాల్డ్ చీడ పురుగులు భావిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఇలాంటి చర్యలు అభిమానులకి కొంత చికాకు కలిగిస్తాయేమోగానీ.. చాలామంది అభిమానులు వాటిని లైట్ తీసుకుంటారు.
మెగా హీరోలైతే.. సోకాల్డ్ చీడ పురుగుల్ని అస్సలు ఎంటర్‌టైన్ చెయ్యరు. అందుకే, మెగా హీరోల మీద ఫడి ఏడుస్తూ, బతికేస్తుంటాయ్.. ఆ చీడ పురుగులలా.!