Political Donkey Police Security.. ఆమె ఓ మహిళా పొలిటీషియన్.! ఓ పార్టీకి అధినేత్రి కూడా.! ‘మా నాన్న ఎవరో తెలుసా.?’ అంటూ దీర్ఘాలు తీస్తుంటుంది.!
‘మీ ఆవిడని మీ ఆవిడ అని ఎందుకు అంటారో తెలుసా.? మీ ఆవిడ కాబట్టి..’ అని విడమర్చి చెప్పగల మేధావి ఆమె.!
అసలు విషయానికొస్తే, ఓ రాజకీయ నిరసనకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు వారించారు.. అడ్డుకున్నారు కూడా.!
ఈ క్రమంలో ఆమె సంయమనం కోల్పోయింది. ‘మీకు పనేమీ లేకపోతే గాడిదల్ని కాసుకోండి..’ అంటూ పోలీసులపై గుస్సా అయ్యింది.
పోలీసులు ఊరుకుంటారా.? మంచి టైమింగ్‌తో ‘అదే చేస్తున్నాం..’ అనేశారు. అంటే, ఇక్కడ గాడిద ఎవరు.? అర్థమవ్వాల్సినవారికి అర్థమయ్యే వుంటుంది.!
Political Donkey Police Security కాపలా కాస్తున్నదెవరికి.?
ఔను, పోలీసులు కూడా టైమింగ్‌తో కూడిన డైలాగులు అలవాటు చేసుకోవాలేమో.! పోలీసు వ్యవస్థ ఈ రోజుల్లో చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, రాజకీయ నాయకుల పబ్లిసిటీ స్టంట్ల నేపథ్యంలో.. వాళ్ళకి కాపలా కాయక తప్పడంలేదు.
ఇంతా చేసి మళ్ళీ, ‘గాడిదలు కాసుకోండి’ అంటూ రాజకీయ నాయకులు సెటైర్లేసే స్థాయికి పోలీసు వ్యవస్థ అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.
నిజమే, పోలీసులు చెబుతున్నది కూడా.. రాజకీయ నాయకులకే కాపలా కాస్తున్నారు.!