Political Exit Poll Survey.. గోతికాడి నక్కలంటాం కదా.! ఇవీ అంతే.! కాదు కాదు, బ్రోకర్ల గురించి మాట్లాడతాం కదా.. అలాంటి వ్యవహారమే ఇది.!
ఎగ్జిట్ పోల్ అనండీ, సాధారణ రాజకీయ సర్వేలనండీ.. వీటి గురించి చాలామంది ప్రజానీకంలో వున్న అభిప్రాయాలివి.!
ఓ మీడియా సంస్థ తరఫున, ‘పొలిటికల్ సర్వే’ గురించిన ప్రతిపాదన వస్తే, ‘కష్టమండీ..’ అని మొహమాటం లేకుండా చెప్పేయాల్సి వచ్చింది.
అలా చెప్పేయడానికి బలమైన కారణం కూడా లేకపోలేదు.! ఓ వీడియో కెమెరా, దాంతోపాటు ఓ మైకు.. పట్టుకుని జనం దగ్గరకు వెళ్ళాలి సర్వే చెయ్యాలంటే.!
అంతకు ముందైతే, చేతిలో ఓ పేపర్, పెన్ను వుంటే సరిపోయేది.! కొన్ని శాంపిల్స్ తీసుకోవాల్సి వుంటుంది. శాంపిల్స్ అంటే, ప్రజలు.. వారి అభిప్రాయాలన్నమాట.
Political Exit Poll Survey.. జనం ఛీత్కరించుకుంటున్నారు..
తీరా, జనం వద్దకు వెళితే.. అక్కడ జనం నుంచి వచ్చే స్పందన వేరేలా వుంటుంది. కొందరు ఛీత్కరించుకుంటారు. ఇంకొందరు ఓవరాక్షన్ చేస్తుంటారు. ఇదీ పరిస్థితి.
ఏ సర్వే సంస్థకైనా ఇలాంటి అనుభవాలు తప్పవు. ఆయా రాజకీయ పార్టీలు, మీడియా సంస్థల ద్వారా చేయించుకునే సర్వేలు వేరేలా వుంటాయి.
ఎంపిక చేసిన జనం వద్దకు పంపి, వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటుంటారు. అలా వచ్చేది అసలు అభిప్రాయమే అవదు.
ఇక, శాంపిల్స్ ఎంత క్వాంటిటీలో తీసుకుటున్నారన్నదీ ముఖ్యమే. క్వాలిటీ అంతకంటే ముఖ్యం.! కానీ, ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్ సంస్థలు కావొచ్చు, మీడియా సంస్థలు కావొచ్చు.. క్వాలిటీ, క్వాంటిటీ గురించి ఆలోచించట్లేదు.
దిక్కుమాలిన సర్వేలు..
ఫలితం తేడా వస్తేనో.? అసలంటూ ఈ దిక్కుమాలిన సర్వేలు జరిగేదే, ఓటర్ల మూడ్ మార్చడానికి. వీళ్ళు మార్చితే మూడ్ మారిపోతుందా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
సంక్షేమ పథకాలకీ, ఈ దిక్కుమాలిన సర్వేలకీ లింకులున్నాయ్.! అనుకూలంగా మాట్లాడకపోతే సంక్షేమ పథకాలు పీకేస్తామంటూ హెచ్చరిస్తారు.
ఓట్లెయ్యకపోతే, సంక్షేమ పథకాలు కట్ అయిపోతాయని సర్వేలు చేసే సంస్థలే హెచ్చరించడమూ ఇటీవలి కాలంలో పెరిగిపోయింది.
Also Read: మెగా కుటుంబం.! సరిపోతుందా ఈ సమాధానం.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం పలు ఎగ్జిట్ పోల్ అంచనాలు తెరపైకొచ్చాయి. బ్యాలెట్ బాక్సుల్లో ఫలితం నిక్షిప్తమైపోయాక, ఈ దిక్కుమాలిన సర్వేలతో పైసా ప్రయోజనం వుంటుందా.? వుండదు.!
మరెందుకీ, ఎగ్జిట్ పోల్ అంచనాలు.? ఏమో, ఆ పైవాడికే ఎరుక.! కోట్లు ఖర్చు చేసి మరీ, ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తుంటారంటే, లాభం లేకుండా చేస్తున్నారా.?
ఇంతకీ, ఈ పొలిటికల్ సర్వేలు లేదా ఎగ్జిట్ పోల్ అంచనాలు మింగేస్తున్న ‘ప్రజాధనం’ ఎంత.?