Political Gaali Patam.. ఆమె కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే.! రాజకీయాల్లో కూడా కామెడీ చేస్తుంటారు.
ఔను మరి, రాజకీయ విమర్శలు చేసేటప్పుడు కాస్తంత ఇంగితం వుండాలి కదా.? లేకపోతే కామెడీ అయిపోతుంది మరి.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన స్వార్జితం నుంచి.. రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నారు. పైగా, కష్టాల్లో వున్నవారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘మీకు నేనున్నా..’ అని భరోసా ఇస్తోన్న పవన్ కళ్యాణ్ తెగిన గాలిపటం ఎలా అవుతారబ్బా.? అధినేత మెప్పు కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడే రాజకీయ నాయకులెక్కడ.? నిబద్ధతతో రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ ఎక్కడ.?
Political Gaali Patam.. గాలిపటం తగిలింది కాబట్టే.. ఎగిరెగిరి పడుతోంది.!
తెగిన గాలిపటం కాబట్టే, పార్టీలు మార్చేస్తుంటారామె. పదవుల కోసం నానా తంటాలూ పడతారు. తీరా, ఆ పదవి వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ నానా తిప్పలూ పడాల్సిందే.
పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే తప్ప, మీడియాలో చోటు దక్కదనే కక్కుర్తి ప్రదర్శించే చాలామంది రాజకీయ నాయకుల్లో ఆమె కూడా ఒకరు.
Also Read: రిషి సునాక్ మనోడేనా.? బాబోయ్ ఏమి ‘కుల’జాడ్యమిది.!
మొత్తానికి, పవన్ కళ్యాణ్ మీద ‘తెగిన గాలి పటం’ అనే విమర్శ చేసి, జబర్దస్త్ కమెడియన్ అపోయిందామె.!
ఇంతకీ ఆమె ఎవరు.? పేరెందుకు, అందరికీ తెలిసిందేగా.! ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవడం తప్ప, పద్ధతిగా ఓ మాట కూడా మాట్లాడలేని మహిళా నాయకురాలామె.! పబ్లిసిటీ కోసమో,
పదవి నిలబెట్టుకోవడం కోసమో.. కారణమేదైతేనేం, పొలిటికల్ గాలిపటమంటూ విమర్శలు చేసేశారుగానీ.. సదరు మహిళా నేతగారి మీద ‘బూతుపటం’ అనే విమర్శలొస్తున్నాయ్.. వాటికేమంటారు.?