Politics For Sale.. రాజకీయాల్లోనూ అమ్మకాలు, కొనుగోళ్ళు బాగా పెరిగిపోయాయ్.! గెలిచే గుర్రానికి ఓ రేటు.. ఓడిపోయే గుర్రానికి కూడా ఓ రేటు.! తగ్గేదే లే.!
తరచూ రాజకీయాల్లో ఓ మాట వింటుంటాం.. ‘ఓడినోడు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏడుస్తాడు.. గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు’ అని.! ఇందులోనూ కొంత నిజం లేకపోలేదు.
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వార్డు మెంబరు కూడా లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. కార్పొరేటర్ అయితే కోటి రూపాయలు మినమమ్ ఖర్చు చేయాలి. ఎమ్మెల్యే అంటే పది నుంచి పాతి కోట్లు.. ఆ పైన ఖర్చు చేయక తప్పదు.
Politics For Sale.. ఈ రేటు.. చాలా హాటు.!
ఎమ్మెల్సీ లాంటి పదవులైతే మరీ దారుణం.! వేలం వేసి మరీ అమ్మేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఈ పదవుల్ని. ఎంపీ టిక్కెట్ అయినా అమ్ముకోవాల్సిందే.. రాజకీయ పార్టీలు అలా తగలడ్డాయ్.
ఇందులో మళ్ళీ రాజ్యసభ టిక్కెట్టుకి వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మంత్రి పదవి రావాలన్ని డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి.
అన్ని పార్టీలూ అలాగే వున్నాయా.? అంటే, ఒకటీ అరా చిన్నా చితకా.. తప్ప రాజకీయం ఇలాగే వుంది మరి.!
డిమాండ్ అండ్ సప్లయ్..
డిమాండ్‌కి అనుగుణంగా సప్లయ్.. దానికి అనుగుణంగా రేటు.. ఇదీ రాజకీయాల్లో పెరుగుతున్న హీటు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ళ అంశం తెరపైకొచ్చింది.
ఒక్కో ఎమ్మెల్యే రేటు కోటి.. అని నిస్సిగ్గుగా రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేని కొన్నాక, ఆ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది.?
Also Read: Rakul Preet Singh.. ఔను, ఆ ‘టచ్’లో చాలా తేడా.!
ఇంతకీ, ఎమ్మెల్యేలని కొనడానికి ఆ వంద కోట్లు ఎక్కడి నుంచి వస్తాయ్.? నిజానికి.. అమ్ముడుపోతున్నది ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. ఆ ఎమ్మెల్యేలు, తమను గెలిపించిన ప్రజల్ని అమ్మేస్తున్నారు.
ప్రజా ప్రతినిథులైనా, పార్టీలైనా అమ్మేసేది ప్రజల్నే. ప్రజల ఆస్తుల్ని, వారి జీవితాల్ని తాకట్టుపెట్టి ప్రభుత్వాలు పరిపాలన చేయడం.. అదే ఘనమైన పాలన అని చెప్పుకోవడం తెలిసిన సంగతే.