Ponniyin Selvan.. మనకి ఆల్రెడీ ఓ ‘బాహుబలి’ వుంది గనుక, ఇంకోటి అలాంటిదే అవసరం లేదన్నది హీరో కార్తీ తన తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ ప్రమోషన్ల సందర్భంగా పేల్చిన డైలాగ్.!
‘బాహుబలి’ కంటే మించిన సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ అవ్వాలి కదా.! అలా ఆశిస్తే, అది తప్పెందుకు అవుతుంది.?
తెలుగు ప్రేక్షకుల్నీ ఆకట్టుకోవాలి.. అందుకే, డ్రమెటిక్‌గా కార్తీ అలా మాట్లాడి వుంటాడన్నది చాలామంది అభిప్రాయపడ్డారు, ఆ వ్యవహారంపై.
ఇంతకీ, Ponniyin Selvan సంగతేంటి.?
మనం చెప్పుకోవాల్సిన కథలు చాలా వున్నాయని కార్తీ, ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ప్రమోసన్ కోసం హైద్రాబాద్ వచ్చినప్పుడు వ్యాఖ్యానించాడు.

నిజమే, తెలుగు నేల మీద ఎన్నో వీరగాధలున్నాయి.. వాటిని సినిమాలుగా తీస్తే, ప్రతీదీ ‘బాహుబలి’కి మించిన సినిమానే అవుతుంది. దేశవ్యాప్తంగా ఇలాంటివి మరెన్నో కథలుంటాయ్.
ఆ కోవలోకే వస్తుంది ‘పొన్నియన్ సెల్వన్’. అయితే, ఈ సినిమాకి ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే, సినిమాలోని పాత్రలు, తెలుగు జనాలకి పెద్దగా అర్థం కాకపోవడం.
నేటివిటీ సమస్య రాదా.?
తెలుగులోనే చాలామందికి ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలోని పాత్రల పేర్లు పలకడం రావడంలేదు. మరి, హిందీలో ఎలా అర్థమవుతుంది.? అదంతే, అర్థం చేసుకోవాల్సిందే.
ఏం, ‘బాహుబలి’ సినిమాలోని పాత్రలు దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు అర్థం కాలేదా.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సంగతేంటి.. అంటే, అది వేరే లెక్క.
Also Read: ‘గాడ్ ఫాదర్’ చిరంజీవిని వెంటాడుతున్న రాజకీయం.!
‘బాహుబలి’ (Baahubali), ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాల్లోని పాత్రల పేర్లు మరీ అంత కష్టంగా వుండవ్. కానీ, ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలోని పాత్రల పేర్లను అర్థం చేసుకోవాలంటే చాలా చాలా కష్టం.
కానీ, కథ జనానికి బాగా ఎక్కేస్తే, విజువల్స్ కట్టి పడేస్తే, కథనం ఆకట్టుకుంటే.. ‘పొన్నియన్ సెల్వన్’లో ఇప్పుడు అర్థం కాని పాత్రలు అప్పుడు బాగా అర్థమైతాయ్.. బలంగా నాటుకుపోతాయ్.!
విక్రమ్ (Vikram), ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), త్రిష (Trisha Krishnan), జయం రవి (Jayam Ravi), కార్తీ (Karthi), ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi).. ఇలా చాలామంది నటీనటులు ఈ సినిమాలో నటించారు.
మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో ఈ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కింది. ఇది మొదటి పార్ట్ మాత్రమే.. దీని తర్వాత మరిన్ని పార్టులు రాబోతున్నాయ్.!