అల్లు అర్జున్ ఆర్మీ దెబ్బకి పారిపోయిన నాగబాబు.?

 అల్లు అర్జున్ ఆర్మీ దెబ్బకి పారిపోయిన నాగబాబు.?

Nagababu Allu Arjun

Allu Arjun Nagababu Twitter.. నాగబాబుకి ఏమయ్యింది.? ఆయనకేమీ కాలేదు. కాకపోతే, నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్‌కి ఏదో అయ్యింది.? ఏమై వుంటుంది.?

ఏమో, ఎవరికీ తెలియదు ప్రస్తుతానికైతే. డీ-యాక్టివేషన్.. అని అంటున్నారు. అది కూడా అల్లు అర్జున్ ఆర్మీ బూతులు భరించలేకనే, నాగబాబు తన ట్విట్టర్ హ్యాండిల్‌ని డీ-యాక్టివేట్ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

నిజమేనా.? అలా జరిగేందుకు అవకాశం ఏదైనా వుందా.? మధ్యలో ఓ వర్గం మీడియా చేస్తున్న అతి సంగతేంటి.? చిరంజీవి పేరుని ఈ వివాదంలోకి ఎందుకు లాగుతున్నట్టు.?

జనసేనలో పని చేసిన పోతిన మహేష్, కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటోళ్ళ మీద సెటైర్లేసే క్రమంలో నాగబాబు చేసిన ఆ ట్వీట్, అనూహ్యంగా అల్లు అర్జున్ వైపు ట్రిగ్గర్ అయ్యింది.

Mudra369

వాస్తవానికి, ప్రముఖుల సోషల్ మీడియా హ్యాండిల్స్ నిర్వహణ అనేది వేరే వ్యక్తులు లేదా, సంస్థల చేతుల్లో వుంటాయ్. ఇది అందరికీ తెలిసిన విషయమే.

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ కూడా బహుశా జనసేన పార్టీకి చెందినవారెవరో మెయిన్‌టెయిన్ చేస్తుండొచ్చు.. ఎన్నికల సీజన్ నేపథ్యంలో.

Allu Arjun Nagababu Twitter.. కొంప ముంచిన నాగబాబు ట్వీటాస్త్రం..

మొన్నీమధ్యన నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్‌ నుంచి దూసుకొచ్చిన ఓ ట్వీటాస్త్రం.. ఈ మొత్తం వివాదానికి కారణంగా చెబుతున్నారు.

‘మనోళ్ళు.. పరాయివాళ్ళు..’ అంటూ అర్థం వచ్చేలా నాగబాబు ట్వీటేయడం, కేవలం అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసుకునే అని, అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన కామెంట్లు పోస్ట్ చేసే కొందరి ఆకతాయిల వాదన.

Allu Arjun Pushpa 2 The Rule
Allu Arjun Pushpa 2 The Rule

మరోపక్క, ఈ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగారనీ, ఆయన సూచనతోనే నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ డీ-యాక్టివేట్ అయ్యిందని కూడా అంటున్నారు.

అయితే, ఈ మధ్య కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ తాత్కాలికంగా డీ-యాక్టివేట్ అవుతున్నాయి, తిరిగి యాక్టివేట్ అవుతున్నాయి. ఎక్కువమంది రిపోర్ట్స్ కొట్టడం వల్ల ఇలా జరుగుతోందనేవారూ లేకపోలేదు.

నాగబాబుకీ, అల్లు అర్జున్‌కీ మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలుంటాయ్.. ఇది ఇప్పటి మాట కాదు.!
ఈ క్రమంలో అల్లు అర్జున్ మీద నాగబాబు సెటైర్లేసే అవకాశమే వుండదన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.

Mudra369

ఏదిఏమైనా, అల్లు వర్సెస్ మెగా అన్న వివాదం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. ‘మేమంతా ఒక్కటే..’ అని ఎంతలా అల్లు, మెగా కాంపౌండ్స్ చెబుతున్నా, పరిస్థితి అదుపులోకి రావడంలేదు.

ఇంతకీ, ఈ వివాదంలో చిరంజీవి పేరుని ఎందుకు కొందరు లాగుతున్నట్టు.? చిరంజీవి, నాగబాబుతో మాట్లాడి వార్నింగ్ ఇచ్చారనీ, అల్లు అర్జున్ విషయంలోనూ ఆయన అసహనం వ్యక్తం చేశాడనీ పుకార్లు ఎవరు పుట్టిస్తున్నట్టు.?

Also Read: క్రికెట్టూ.. సినిమాలూ.. సూడకపోతే కొంపలు మునిగిపోవ్.!

అత్యంత వ్యూహాత్మకంగా మెగా కాంపౌండ్‌లో చిచ్చు పెట్టే ప్రయత్నమైతే బలంగా జరుగుతోందన్నది కొందరి వాదనగా కనిపిస్తోంది. అదే సమయంలో నాగబాబు అతి, అల్లు అర్జున్ అతి.. కూడా చర్చనీయాంశమవుతున్నాయి.

ఒక్కటి మాత్రం నిజం. ఎన్నికల వేడి బాగా రాజుకున్నప్పుడు, కుటుంబ సభ్యుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా పిఠాపురం వెళ్ళకుండా, స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవి రెడ్డి కోసం నంద్యాల వెళ్ళిన అల్లు అర్జున్.. ఇంతటి వివాదానికి కారకుడయ్యాడన్నది నిర్వివాదాంశం.

Digiqole Ad

Related post