Pooja Hegde వెకేషన్ కోసం మాల్దీవులకు వెళుతుంటారా.? ఆ పేరు చెప్పి అభిమానుల గుండెల్లో ‘బికినీ’ ముల్లు గుచ్చేయడానికి అందాల భామలు మాల్దీవుల్ని ఎంచుకుంటారా.? ఏమోగానీ, మేడమ్ పూజా హెగ్దేకీ ఈ మాల్దీవులంటే భలే ఇష్టం.!
స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడితే ఏముంటుంది కిక్కు.? ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ, ఆ అందాలకి తమ అందాలతో సవాల్ విసరడంలోనే అసలు కిక్కు.. అనుకుంటుందో ఏమోగానీ, మాల్దీవుల్లో ప్రతిసారీ అందాల మంట పెట్టేస్తుంటుంది పూజా హెగ్దే.
అలా తాజా మాల్దీవ్స్ టూర్ కూడా తనదైన స్టయిల్లో సూపర్ హిట్టయ్యేలా పూజా హెగ్దే అందాల విందు చేసేసింది. ఆ అందాల అనుభవాల్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతోంది కూడా.!

ఒత్తిడిని ఇలా దూరం చేసుకుంటుందట..
తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో బిజీ బిజీగా వుంటోన్న పూజా హెగ్దే, కాస్త ఖాళీ టైమ్ దొరికితే వెకేషన్స్‌ని ఎంజాయ్ చేయడం ద్వారా అలసటనీ, మానసిక ఒత్తిడినీ దూరం చేసుకుంటుందట.
Also Read: పొట్టి డ్రస్సు.. అనసూయ కస్సు బుస్సు
అందమంటే బికినీ మాత్రమే కాదు. కానీ, బికినీలో అందచందాలు పొందిగ్గా ప్రదర్శించాలంటే, దానికోసం కూడా చాలా చాలా కష్టపడాల్సిందేనట. స్ట్రిక్ట్ డైట్ మెయిన్‌టెయిన్ చేస్తేగానీ, ఒంపు సొంపులు సరిగ్గా వుండవన్నది పూజా హెగ్దే ‘డైట్’ మంత్ర.

అంతేనా, వీలైనంత సమయం వ్యాయామం చేయగలిగితే అందం, ఆరోగ్యం.. అంటోంది పూజా హెగ్దే. అన్నట్టు, ఫిట్‌నెస్ మంత్రలో అతి కీలకమైనది స్విమ్మింగ్ అట.
స్విమ్మింగ్ చేస్తే అటు ఫిట్నెస్, ఇటు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం.. దాంతోపాటుగా ఆరోగ్యం.. అని పూజా హెగ్దే (Pooja Hegde) చెప్పుకొచ్చింది.