Pooja Hegde Is Back.. ఏమైంది పూజా హెగ్దేకి.? చాన్నాళ్ళుగా ఆమె సినిమా వార్తల్లో కనిపించడంలేదు.! ఒకప్పుడు పూజా హెగ్దే పేరు మార్మోగిపోయింది.
తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో చాలా బిజీగా ఒకప్పుడు కనిపించిన పూజా హెగ్దే, ఇప్పుడు పూర్తిగా సైలెంటయిపోయింది.
బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో ‘గోల్డెన్ లెగ్’ పూజా హెగ్దే కాస్తా, ‘ఐరన్ లెగ్’ పూజా హెగ్దే అయిపోయింది. ‘లెగ్గు’ మాత్రం కామన్ అండోయ్.!
Pooja Hegde Is Back.. కాళ్ళు.. ఆ ఫోకస్..
ఎందుకంటే, పూజా హెగ్దే ‘కాళ్ళ’ మీద ‘అల వైకుంఠపురములో’ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెట్టిన ఫోకస్‌ని అంత తేలిగ్గా మర్చిపోలేరెవరు.!

అసలు విషయానికొస్తే, చాన్నాళ్ళ తర్వాత పూజా హెగ్దే కొత్త సినిమా గురించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. తమిళ నటుడు సూర్య సరసన పూజా హెగ్దే ఓ సినిమాలో నటించబోతోంది.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మలయాళ నటుడు జోజు జార్జ్ నెగెటివ్ రోల్ చేయబోతున్నాడు.
అన్నట్టు, తెలుగులోనూ ఓ రెండు మూడు సినిమాల్లో పూజా హెగ్దే నటించే అవకాశాలున్నాయట. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయ్.
ఛత్.. సినిమాల గురించి ఇప్పుడు పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ వుండటం లేదు. థియేటర్లలో సినిమాని చూడ్డానికి ప్రేక్షకులు అంతగా ఇష్టం చూపకపోవడమే దానికి కారణం.
గోల్డెన్ లెగ్.. ఐరన్ లెగ్.. ఒక్కోసారి ఒక్కో ఇమేజ్.! కానీ, అన్నిట్లోనూ ‘లెగ్గు’ మాత్రం కామన్ అయిపోయింది.!
పూజా హెగ్దే లెగ్స్ మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులే రీసెచ్చ్ చేసినట్లుగా సినిమాలు తీసేశారు మరి.!
Mudra369
ఓటీటీ వుందిగా.. అన్న భావన జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది. దాంతో, సినిమాల నిర్మాణం కష్ట సాధ్యంగా మారిపోయింది దర్శక నిర్మాతలకి.
Also Read: వేడికి తాళలేక.. స్విమ్మింగ్ పూల్‌లో సెగలు పుట్టిస్తోన్న కేథరీన్.!
పూజా హెగ్దే అనే కాదు, కాస్తో కూస్తో వార్తల్లో వుంటోన్న రష్మిక మండన్న గురించైనా, మృనాల్ ఠాకూర్ గురించి అయినా.. స్టార్ హీరోల గురించి అయినా.. ఈ మధ్య సరైన వార్తలే కనిపించడంలేదాయె.!