Pooja Hegde Sea Glamour.. సముద్రాన్ని మించిన అందం ఈ భూమ్మీద ఇంకేముంటుంది.? అంటాడో కవి.! అది నిజం కూడా.!
అందుకే, సముద్రాన్ని చూస్తే ఎవరైనా చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టాల్సిందే. సముద్రం నుంచి వచ్చే గాలి.. తీరాన్ని తాకేందుకు ఆరాటపడే కెరటాలు.. ఆ కిక్కే వేరప్పా.
సముద్రాన్ని ఉదయం చూసినా, మధ్యాహ్నం చూసినా, సాయంత్రం చూసినా.. దేనికదే ప్రత్యేకం. ప్రతి రోజూ సముద్రం కొత్తగా వుంటుందని ప్రత్యేకంగా చెప్పాలా.?
Pooja Hegde Sea Glamour.. సముద్ర తీరాన.. పూజానందం.!
ఫొటోలో వున్నదెవరో తెలుసు కదా.! మేడమ్ సర్.. మేడమ్ అంతే.! ఔను, పూాజా హెగ్దే, వెకేషన్ సందర్భంగా ఇదిగో ఇలా సముద్ర తీరాన సందడి చేసింది.
Also Read: దీపిక పదుకొనె స్కూల్.! కొత్త జర్నీ షురూ.!
త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరెక్టరే, పూజా హెగ్దే ‘కాళ్ళ అందాన్ని’ మరింత అందంగా చూపించేందుకు తహతహలాడాడు.
పూజా హెగ్దే అంటే, ఆ కాళ్ళ సోయగమే.. అనేంతలా మారిపోయింది పరిస్థితి. అందుకేనేమో.. మొహం చూపించాల్సిన పనిలేదనుకున్నట్టుంది పూజా హెగ్దే.
ఏదిఏమైనా.. పోజ్ అయితే అదిరింది.!
ఫిల్టర్స్ అవసరమే లేదు..
బీ నేచురల్.. అంటాడో కవి.! సహజమైన అందం ముందు, ఎలాంటి మేకప్పులూ నిలబడలేవనేది తెలిసిన విషయమే.!

ఇదిగో, పూజా హెగ్దే.. అలా ఏ ఫిల్టర్ లేని సహజత్వంతో కూడిన ఫేస్‌ని, ఆ ఎక్స్ప్రెషన్స్నీ కెమెరాలో బంధించి, మనముందుంచింది.
‘నీ అందం సముద్రమంత..’ అంటూ పూజా హగ్దేని ఉద్దేశించి ఆమె అభిమానులు కవితలూ రాసేస్తున్నారు. అద్గదీ అసలు సంగతి.!