Table of Contents
Poonam Kaur.. సినీ నటి పూనమ్ కౌర్ తరచూ వార్తల్లోకెక్కుతుంటుంది. కాదు కాదు, ఆమె పేరుని వివాదాస్పదంగా వార్తల్లోకెక్కిస్తుంటారంతే.!
ఏదో ఊరికే అలా జరిగిపోదు.! తరచూ, ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని కామెంట్స్ కారణంగానే, ఆమె నిత్యం లైమ్‌లైట్‌లో వుంటూ వస్తోంది. తాజాగా ఓ ఫొటో వివాదంలో పూనమ్ పేరు వైరల్ అయ్యింది.
పూనమ్ కౌర్, ఇద్దరు చిన్నారులతో కలిసి వున్న ఫొటో కారణంగా పెద్ద యాగీ జరుగుతోంది. పూనమ్ కౌర్ – పవన్ కళ్యాణ్ మధ్య ఏదో వుందంటూ చాలాకాలంగా పనిగట్టుకుని కొందరు గాసిప్స్ సృష్టిస్తోన్న విషయం విదితమే.
పీకే లవ్.! అక్కడి నుంచి పీక్స్‌కి చేరిన వివాదాలు.!
గతంలో ‘పీకే లవ్’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి పూనమ్ కౌర్ పలు ట్వీట్లు పెట్టింది. పీకే అంటే పవన్ కళ్యాణ్.. పీకే అంటే పూనమ్ కౌర్.. అలా డబుల్ ఇంపాక్ట్ కోసమే పూనమ్ అలా చేసిందనే ప్రచారమూ లేకపోలేదు.

ఇక, ‘గురూజీ’ పేరుని ప్రస్తావిస్తూ పరోక్షంగా త్రివిక్రమ్ మీద సెటైర్లు వేయడం, ఆ గురూజీకి.. ప్రజా నాయకుడవ్వాలనుకుంటున్న పవర్ స్టార్ దూరంగా వుండాలని పూనమ్ కౌర్ సలహాలు ఇవ్వడం ఇవన్నీ తెలిసిన సంగతులే.
మీడియాలో హైలైట్ అయ్యేందుకే పూనమ్ ఇవన్నీ చేస్తోందా.? అన్న అనుమానాలైతే తరచూ పవన్ అభిమానులకు కలుగుతుంటాయి.
Poonam Kaur మీద ఎందుకింత ప్రేమ, అసహనం.?
పూనమ్ పేరుతో పవన్ కల్యాణ్ మీద కొందరు హేటర్స్ చెలరేగిపోతుంటారు. అలా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసేవారిలో ఎక్కువగా వైసీపీ, టీడీపీ అభిమానులే కాదు, ఎన్టీయార్ అలాగే మహేష్‌బాబు అభిమానులూ వుంటారు.
ఇప్పుడు తాజాగా పై ఫొటో వైరల్ అవడంతో, ఆ ఫొటోలోని పిల్లలు పవన్ కళ్యాణ్ – పూనమ్ పిల్లలనీ, పూనమ్ వద్ద పిల్లలు పెరుగుతున్నారనీ దుష్ప్రచారం మొదలైంది.
ఈ వ్యవహారంపై తాజాగా పూనమ్ కౌర్ స్పష్టతనిచ్చింది. ‘ఆ ఇద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ పిల్లలు..’ అంటూ పేర్కొంది. ఇప్పటికే భరించలేని డ్యామేజ్ జరిగిందంటూ, సోషల్ మీడియా ద్వారా వాపోయింది.
ఏ రాజకీయ పైత్యంతో ఇదంతా.?
తెలంగాణలోని పొలిటికల్ లీడర్ హిపోక్రసీ గురించి మరో ట్వీట్‌లో పూనమ్ ప్రస్తావించింది. పొలిటికల్ డిఫేమేషన్ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని కూడా ఆరోపించింది పూనమ్ కౌర్.
Also Read: Kangana Ranaut.. వామ్మో.! ఏం తెలివి.? క్లీన్ బౌల్డ్ చేసేస్తోందే.?
ఈ వివాదం ఇక్కడితో ఆగదు. ఇంకో వివాదం మళ్ళీ తెరపైకి వస్తూనే వుంటుంది. ప్రతిసారీ పవన్ కళ్యాణ్ టార్గెట్‌గానే వివాదాలు పుట్టుకొస్తుంటాయ్.
ఆయన రాజకీయాల్లో వున్నా, సినిమాల్లో కొనసాగుతున్నా. అంతలా ఆయన మీద ద్వేషాన్ని నింపేసుకున్నారు కొందరు.