Poonam Kaur Political Entertainment.. సినీ నటి పూనమ్ కౌర్ తరచూ వార్తల్లోకెక్కుతుంటుంది. సెలబ్రిటీలన్నాక.. వారు మాట్లాడే ప్రతి మాటా హాట్ టాపిక్ అవుతుంటుంది మరి.!
అసలు విషయమేంటంటే, ప్రస్తుత రాజకీయాలపై పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా సెటైర్ వేసింది.
రాజకీయాలు ఎంటర్టైన్మెంట్‌గా మారిపోయాయనీ.. ఎంటర్టైన్మెంట్ మాత్రం సీరియస్‌గా మారిపోయిందనీ పూనమ్ కౌర్ అభిప్రాయపడింది.!
Poonam Kaur Political Entertainment.. ఎవరి మీద ఈ సెటైరు.?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బ్రో’ (Bro The Avatar) సినిమా విడుదలైంది.. రాజకీయ దుమారం రేగింది. రాజకీయాల్లో బోల్డంత ఫన్ జనరేట్ అయ్యింది.!
ఈ వ్యవహారం మీదనే పూనమ్ కౌర్ (Poonam Kaur) ట్వీటేసిందా.? లేదంటే, ఇంకేదన్న ఆలోచనతో ఆ ట్వీట్ వేసి వుండొచ్చా.?

ఎవరికీ వాస్తవం అనవసరం.! పూనమ్ కౌర్‌ని (Poonam Kaur) తిట్టేవాళ్ళు కొందరు.. ఆమెని అభినందించి, ఆమెకి మద్దతుగా నిలిచేవారు మరికొందరు.!
ఆమెక్కావాల్సిందీ ఇదే.!
ఔను, పూనమ్ కౌర్ (Poonam Kaur) కోరుకునేది కూడా ఇదే.! వార్తల్లో వుండాలనుకుంది.. అది ట్వీటు ద్వారా సాధించింది కూడా.!
ఒక్కటి మాత్రం నిజం.. రాజకీయాల్లో ఎంటర్టైన్మెంట్ మరీ ఎక్కువైపోయింది. అది అత్యంత జుగుప్సాకరంగా మారిపోయింది కూడా.!
బాధ్యతగల వ్యక్తులు బాధ్యతల్ని విస్మరించి.. ప్రజా ప్రతినిథులమన్న విషయాన్ని మర్చిపోయి.. సినిమాలకు రివ్యూలిస్తున్నారు.. కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు.!
Also Read: ప్చ్.! ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయిందే.!
ఇంతకీ, పూనమ్ కౌర్ ఎందుకు ప్రతిసారీ గురూజీ గురించో.. పవన్ కళ్యాణ్ గురించో.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నట్టు.?
‘జల్సా’ సినిమా సమయంలో తనకు హ్యాండిచ్చి, పార్వతి మెల్టన్‌ని తీసుకున్నారన్నది పూనమ్ కౌర్ అసహనానికి కారణం.
సినిమా అన్నాక.. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు వుంటాయ్. అది తెలియనంత అమాయకత్వం అయితే పూనమ్ కౌర్‌లో వుందని అనుకోలేం.
పూనమ్ కౌర్ ఏ ట్వీట్ వేసినా, అందులో అర్థం వున్నా లేకపోయినా.. దాన్ని పవన్ కళ్యాణ్ లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఆపాదించేయడం పరిపాటిగా మారిపోయింది.
ఫ్రీ పబ్లిసిటీ వస్తోంటే, పూనమ్ కౌర్ మాత్రం ఎందుకు వదులుకుంటుంది.?