Poonam Pandey Cervical Cancer.. నటి, సోషల్ మీడియా సెన్సేషన్ పూనమ్ పాండే తెలుసు కదా.? పరిచయం అక్కర్లేదు కొత్తగా ఆమె గురించి.! అంత పాపులారిటీ సంపాదించుకుందామె.
ఓ తెలుగు సినిమాలో కూడా పూనమ్ పాండే నటించింది. చేసిన సినిమాల కంటే, పూనమ్ పాండే సోషల్ మీడియా పోస్టులే ఎక్కువ పాపులారిటీ ఆమెకి తెచ్చిపెట్టాయ్.
అంతేనా, బోల్డన్ని వివాదాలూ పూనమ్ పాండేని వార్తల్లో వ్యక్తిగా మార్చేశాయి. ఈసారీ ఆమె ఇంకా సెన్సేషనల్‌గా వార్తల్లోకెక్కేసింది.!
Poonam Pandey Cervical Cancer.. నిజమేనా.?
పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. దానర్థం, ఆమె సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి మరణించిందని.
అదేంటీ, నాలుగు రోజుల క్రితమే కదా.. సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఓ వీడియో పోస్ట్ చేసింది.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. పూనమ్ పాండే చనిపోయిందన్న వార్త మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ దర్శనమిస్తోంది.
పలు రియాల్టీ షోల్లోనూ సందడి చేసిన పూనమ్ పాండే, పబ్లిసిటీ స్టంట్స్ చేయడంలో దిట్ట. ప్రేమ, పెళ్ళి.. వాట్ నాట్.. అన్నిటినీ పబ్లిసిటీ స్టంట్లకు వాడేసుకుంది.
వివాదాలే కాదు.. అవీ, ఇవీ.. అన్నీ.!
అయితే, పూనమ్ పాండే జీవితం వివాదాలమయం మాత్రమే కాదు.. అంతకు మించి, మానసిక.. శారీరక క్షోభ అనుభవించిందామె.
సోషల్ మీడియా వేదికగా న్యూడ్ వీడియోలు పోస్ట్ చేయడం దగ్గర్నుంచి, సేవా కార్యక్రమాల వరకూ.. పూనమ్ పాండే రూటే సెపరేటు.

అప్పుడెప్పుడో టీమిండియా వరల్డ్ కప్ పోటీల్లో పాకిస్తాన్ మీద మళ్ళీ నెగ్గితే, నగ్నంగా మైదానంలో నడుస్తానంటూ సంచలన ప్రకటన చేసి అందరి దృష్టిని ఆకర్షించిందామె.
ఆ తర్వాత మాట మార్చినా, ఆమె నగ్న వీడియోలకైతే కొదవేం లేదు.
Also Read: ప్రియమ్.! అందాల ‘ప్రకాశ’మ్.! గ్లామరస్ ‘వారియర్’.!
ఏమో, నిజమెంతోగానీ.. పూనమ్ పాండే (Poonam Pandey) ఇక లేదన్న వార్త మాత్రం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
ఈసారి కూడా పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్ మాత్రమే చేసిందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
అన్నట్టు, పూనమ్ పాండే వయసు జస్ట్ 32 ఏళ్ళు మాత్రమే.! ఇంత చిన్న వయసులో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి ఆమె ప్రాణాలు కోల్పోవడమేంటో.!