Poonam Pandey.. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా టైటిల్ తరహాలో.. ఫాఫం సోషల్ మీడియా సెన్సేషన్ పూనమ్ పాండేకి భర్త కారణంగా చితక్కొట్టుడు తప్పడంలేదు. ‘నా భర్త నన్ను కొట్టాడు బాబోయ్..’ అంటూ గతంలో ఓసారి పూనమ్, తన భర్త సామ్ బాంబే మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఆ తర్వాత సామ్ బాంబే బెయిల్ మీద విడుదలయ్యాడు. ‘తూచ్, అదంతా చిన్న గొడవ.. మేమిద్దరం అన్యోన్య దాంపత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాం..’ అంటూ ఆ తర్వాత పూనమ్ పాండే సోషల్ మీడియాలో చేసిన ‘ఛండాలం’ అంతా ఇంతా కాదు.
Poonam Pandey, ఇదేం కొట్టుడు.?
సోషల్ మీడియాని పూనమ్ పాండే వాడినంత ఛండాలంగా ఇంకెవరూ వాడరు మరి. అందులో అన్నీ వుంటాయ్.. దాదాపుగా అంతా అసభ్యమే. ఎలాగైనాసరే, పబ్లిసిటీ సంపాదించుకోవడమే పూనమ్ పాండే లక్ష్యం. భర్త మీద గతంలో చేసిన పిర్యాదు కూడా పబ్లిసిటీ స్టంటేనంటారు.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
తాజాగా, మరోమారు పూనమ్ పాండే తన భర్త మీద పోలీసులకు పిర్యాదు చేసింది. తనను శారీరకంగా హింసించాడని పూనమ్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సామ్ బాంబేని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే, గాయాలతో ఆమె ఆసుపత్రిలో చేరడం. అంటే, ఈసారి చితక్కొట్టుడు నిజమేనని అనుకోవాలేమో.

పబ్లిసిటీ స్టంటు కాదు కదా.?
అయినా, ఇదేం పోయేకాలం.? పూనమ్ పాండేని (Poonam Pandey) అంతలా కొట్టాల్సిన అవసరం సామ్ బాంబేకి ఏమొచ్చింది.? ఏమో, ఎక్కడో తేడా కొట్టిందో.. లేదంటే, ఈసారి పబ్లిసిటీ స్టంట్ మరింత సహజంగా వుండాలన్న కోణంలో ఇద్దరూ కలిసే ప్లాన్ చేశారోనని.. జనం అనుకుంటున్నారు.
అప్పుడెప్పుడో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిస్తే మైదానంలో నగ్నంగా నడుస్తానంటూ సంచలన ప్రకటన చేసి వార్తలెక్కిన పూనమ్ పాండే అప్పటినుంచి, ఇప్పటిదాకా.. అలాంటి పబ్లిసిటీ స్టంట్లే కాదు, న్యూడ్ షోలూ చేస్తూనే వుంది.
అవి చాలక.. ఇదిగో, ఇలా భర్తతో ‘చీకటి గదిలో చితక్కొటుడు’ ఆట కూడా ఆడేస్తూ.. పోలీసులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది.