Home » ‘పెద్ది’ ఫస్ట్ షాట్: గ్రౌండ్ అవతలికి సిక్సర్ కొట్టేశాడు రామ్ చరణ్

‘పెద్ది’ ఫస్ట్ షాట్: గ్రౌండ్ అవతలికి సిక్సర్ కొట్టేశాడు రామ్ చరణ్

by Mudra369 Editorial Desk
0 comments
Ramcharan Pedddi

Ramcharan Peddi First Shot.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా నుంచి శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ షాట్ విడుదల చేశారు.

రామ్ చరణ్ (Global Star Ram Charan) సరసన ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్.. సంయుక్తంగా ఈ ‘పెద్ది’ (Peddi Movie) చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

‘ఫస్ట్ షాట్’ మైండ్ బ్లోయింగ్ అంతే.! ఔను, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘బీస్ట్’ అవతారాన్ని బుచ్చిబాబు సన, చాలా బాగా క్యాప్చర్ చేశాడు.

ఉత్తరాంధ్ర స్లాంగ్, ఈ ‘పెద్ది’ సినిమాకి ప్రధాన ఆకర్షణగా కనిపించబోతోంది. క్రికెట్ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్టైనర్‌గా ‘పెద్ది’ చిత్రాన్ని బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్నాడు.

Ramcharan Pedddi
Ramcharan Pedddi

బ్యాట్ పట్టుకుని, పిచ్ మీద ఆ బ్యాట్ హ్యాండిల్‌తో గుద్ది, వేగంగా వస్తున్న బంతిని బ్యాటుతో బౌండరీ అవతలికి నేరుగా చరణ్ పంపించిన సీన్.. ఈ టీజర్ మొత్తానికి హైలైట్.

డైలాగ్స్ కూడా చాలా బాగా ‘డిజైన్’ చేసినట్లు అనిపిస్తుంది.. వినేవారికి. ‘ప్యూర్ ఉత్తరాంధ్ర స్లాంగ్’ని చాలా పక్కాగా వాడారు. రామ్ చరణ్, ఆ యాసని బాగా అర్థం చేసుకుని, డైలాగ్ చెప్పాడు.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

© 2020-26, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group