Poor Vs Rich Mudravalokanam.. ఈ మధ్య పేదలు వర్సెస్ పెత్తందార్లు.. అంటూ పెద్దయెత్తున రాజకీయ రచ్చ జరుగుతోంది. ఇంతకీ పేదలెవరు.? పెత్తందార్లు ఎవరు.?
పేదలంటే అందరికీ తెలిసిందే.! వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళు.. అంటే, ధనికులే పెత్తందార్లు అన్నమాట.!
ఏళ్ళుగా.. కాదు కాదు, దశాబ్దాలుగా.! ఆ మాటకొస్తే, శతాబ్దాలుగా.. పేదలు వర్సెస్ పెత్తందార్లు.. అనే పంచాయితీ నడుస్తూనే వుంది.
Poor Vs Rich Mudravalokanam .. రాజకీయ పెత్తందార్లు.!
నిజానికి, పేదల మీద ఇప్పుడు రాజకీయ పెత్తందారీతనం (Politics) ఎక్కువైపోయింది.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే వాస్తవం.!
సంక్షేమ పథకాలు ఎవరి కోసం.? నిస్సందేహంగా పేదల కోసమే.! ఆ పేదలందు మళ్ళీ రాజకీయ పేదలు వేరయా.. అని చెప్పుకోవాల్సి వస్తుంది.
దశాబ్దాలుగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయ్.! ఈ సంక్షేమ పథకాల (Welfare Schemes) వల్ల ఎంతమంది పేదలు, ధనికులుగా మారుతున్నట్టు.?
ఇవే సంక్షేమ పథకాల కారణంగా ఎంతమంది మధ్య తరగతి ప్రజానీకం పేదలుగా మారిపోతున్నారు.? ఇది కూడా ఆలోచించాలి మరి.!
పన్నులు కట్టి.. దోపిడీకి గురవుతున్న వైనం..
పన్నులు కట్టడం ఈ రోజుల్లో పాపమైపోతోంది.! ఔను, పన్నులు కడితే, సంక్షేమ పథకాలు అందడంలేదు. అలాంటప్పుడు, ఎవడైనా కష్టపడి ఎందుకు సంపాదించాలి.?
మొత్తమ్మీద, ఇదో సామాజిక రోగంలా తయారైందన్నమాట.! వందల కోట్లు, వేల కోట్లు సంపాదించిన రాజకీయ నాయకులు.. పేదల పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు.
Also Read: బండ్ల సలహా.! గురూజీకి గిఫ్టు కొట్టు.! నిర్మాతగా ఛాన్సు పట్టు.!
సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ, సలహాదారులకీ.. అయినవారికీ.. ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారు.
దోచుకో.. తినుకో.. పంచుకో.. ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది ఇదే.! మళ్ళీ పేదలు.. పెత్తందార్లు.. అంటూ పనికిమాలిన ప్రస్తావన ఒకటి.!
ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే.. అన్నట్టు.. రాజకీయ పెత్తందార్లే.. ‘పేదలు – పెత్తందార్లు’ అంటూ కొత్త పంచాయితీని తెరపైకి తెస్తున్నారంటే.. ఔను, ఇది కలికాలం.!
– yeSBee