Posani Krishna Murali Paityam.. ప్రముఖులనే కాదు.. మామూలుగా ఎవరన్నా చనిపోతే, పార్దీవ దేహాన్ని చూడటానికి ఇరుగూ పొరుగూ వెళతారు.
అత్యంత సన్నిహితులు వచ్చేవరకూ పార్దీవ దేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్ళరు. ‘కడసారి చూపు’కి వున్న ప్రాముఖ్యత అలాంటిది.
కానీ, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) మాత్రం, తాను చనిపోయాక తన శవాన్ని ఎవరికీ చూపించొద్దని అంటున్నాడు.
కేవలం కుటుంబానికి మాత్రమేనట..
కుటుంబ సభ్యులకు మాత్రమే తన శవాన్ని చూపించాలంటూ ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
చావు పుట్టకల గురించి మాట్లాడేటప్పుడు.. ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి ఎవరైనా. మనషిగా బతకాలి.. మనిషిగానే చావాలి.! మనిషి ఆలోచనలు ఇలాగే వుండాలి.
చావు ఎప్పుడెవరికి ఎలా వస్తుందో తెలియదు. ఎవరు ఎక్కడ ఎలా పుడతారన్నది ముందే నిర్ణయించుకుంటే జరిగేదీ కాదు.!
ఈ భూమ్మీదకి అతిథుల్లా వచ్చాం.. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోదాం.. ఇలా సాగుతుంది ఓ సినిమాలో డైలాగ్. అదీ నిజమే కదా.!
Posani Krishna Murali Paityam.. తూటాల్లా మాటలు పేలాయ్‌గానీ..
పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) అంటే, ఒకప్పుడు సంచలన రచయిత. సినిమాలకు ఆయన రాసిన మాటలు తూటాల్లా పేలాయి. ఎన్నో కథలు సూపర్ హిట్స్ అయ్యాయి సినిమాలుగా మారి.!
కానీ, దురదృష్టం.. పోసానికి ‘మాట’ మీద అదుపు వుండదు. ఎందుకు బీపీ తెచ్చుకుంటాడో ఆయనకే తెలియదు. రాజకీయాన్ని వంటబట్టించుకున్నాక, ‘మెంటల్ కృష్ణగా మారిపోయాడన్న విమర్శలున్నాయి.
Also Read: చిట్టీ.! నువ్వొస్తానంటే వాళ్ళే వద్దంటున్నారా.?
ఇదిగో, చావు ప్రస్తావన తెచ్చి, ‘మెంటల్ కృష్ణ’ (Mental Krishna) అన్న పేరుని సార్ధకం చేసుకున్నట్టున్నాడాయన.!
పోయినోళ్ళంతా మంచోళ్ళేనంటాడో పెద్ద మనిషి.! పోసాని బతికుండగా ఎంతమందితో శతృత్వం పెంచుకున్నా.. ఎంతమంది ఛీత్కారాలు అందుకున్నా.. అదంతా ఆయన బతికి వున్నంతవరకే.
ఎవరికైనా ఇది వర్తిస్తుంది.! పోయాక, ఎవర్ని చూసయినాగానీ.. అయ్యోపాపం.. అనుకుండా వుండగలమా.? ఏందయ్యా నీ వాలకం పోసానీ.!