ఏడాదికి రెండు సినిమాలు చేస్తానంటూ ప్రభాస్ (Saaho Prabhas Darling), ‘బాహుబలి’ సినిమా తర్వాత అభిమానులకు మాటిచ్చాడు.. కానీ, నిలబెట్టుకోలేకపోయాడు. ఈసారి మాటివ్వబోడట.. కానీ, ఏడాదికి రెండు సినిమాలు చేస్తాడట. ప్రభాస్ (Young Rebel Star Prabhas) లాంటి హీరో ఏడాదికి రెండు సినిమాలు చేస్తే ఏంటి, రెండేళ్ళకు ఓ సినిమా చేస్తే ఏంటి.? బాక్సాఫీస్ వద్ద ఆ ఇంపాక్ట్ కోసమే కదా, ‘డార్లింగ్స్’ ఎదురు చూసేది.?
‘బాహుబలి’ (Baahubali) కోసం ప్రభాస్ పడ్డ కష్టం సంగతి పక్కన పెడితే, ఆ సినిమాతో వచ్చిన రిజల్ట్.. రెండు కాదు, ఐదు కాదు, పది సూపర్ హిట్ సినిమాలతో అయినా వస్తుందా.? అందుకే ‘డార్లింగ్స్’ (Darling Prabhas) మాత్రం, ప్రభాస్ నుంచి ‘ఆ రేంజ్’ సినిమానే ఆశిస్తారు. మరి, తన ‘డార్లింగ్స్’ అంతగా ఆశిస్తున్నప్పుడు, వారి అంచనాల్ని అందుకోవడానికి కాస్తంత టైమ్ తీసుకోకపోతే ఎలా.?
‘సాహో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అభిమానుల్ని ప్రభాస్ (Rebel Star Prabhas) ఓ రేంజ్‌లో అలరించాడు. తన మాటలతో మాయ చేశాడు. అభిమానులు, ప్రభాస్ మాటలకి ఫిదా అయిపోయారు. అభిమానులు అరుపులు, కేకలతో హోరెత్తించేస్తే.. వారిని ఉత్సాహ పరిచేందుకు పదే పదే ‘లవ్ యూ డార్లింగ్..’ అంటూ అభిమానుల్ని ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడటం ఓ రేంజ్‌లో కిక్ ఇచ్చింది అందరికీ.
‘రన్ రాజా రన్’ టైమ్‌లో తనకు సుజీత్ (Sujeeth Saaho) చెప్పిన కథ, ఆ తర్వాత చాలా పెద్దదిగా మారడం, ఆ సినిమా రేంజ్‌ని నిర్మాతలు ఇంకా పెంచేయడం.. హాలీవుడ్ టెక్నీషియన్లను సుజీత్ డీల్ చేసిన విధానం.. ఇలా ప్రభాస్ చాలా విశేషాల్ని చెప్పాడు ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. పేరు పేరునా టెక్నీషియన్లకీ, నటీనటులకీ థ్యాంక్స్ చెప్పి తానెందుకు అందరికీ ‘డార్లింగ్’ అవుతాడో చెప్పకనే చెప్పేశాడు ప్రభాస్.
‘ఆల్ ఇండియా స్టార్’ అని రాజమౌళి, స్టేజ్ మీద నుంచి చెబుతోంటే, ప్రభాస్ ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు. అవును మరి, ప్రభాస్‌ని ‘ఛత్రపతి’గా మార్చింది రాజమౌళినే.. ప్రభాస్‌ని ‘బాహుబలి’ని చేసింది కూడా రాజమౌళినే.
కొడుతున్నాం, కొట్టేస్తున్నాం.. అని ప్రభాస్ (Saaho Prabhas Darling) చెప్పాల్సిన పనిలేదు.. ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ చూస్తే, అది సక్సెస్ ఫంక్షన్‌లా అనిపించింది. ‘సాహో’ కోసం వాడిన పలు వాహనాల్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శనకు వుంచారు. అవి ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.