Prabhas Darling Maruthi.. సినిమాల ఎంపిక విషయంలో రిస్క్ తీసుకోవడం ప్రభాస్‌కి అలవాటే. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా.. ప్రభాస్ తీసుకునే రిస్క్.. ఆయనలోని డైనమిక్ నేచర్‌ని బయటపెడుతుంటుంది.
రాజమౌళి సినిమా కోసం అయితే మాత్రం, ఐదేళ్ళు సమయం కేటాయించడం సబబేనా.? అన్న విమర్శలొచ్చాయ్ ‘బాహుబలి’ సినిమా టైమ్‌లో.!
కానీ, ఐదేళ్ళలో పది సినిమాలు చేసినా రాని ఫాలోయింగ్, ఒక్క ‘బాహుబలి’తో (Baahubali) ప్రభాస్‌కి వచ్చేసింది మరి.! ‘
సాహో’ (Saaho) ఫెయిల్ అయి వుండొచ్చు, కానీ, హాలీవుడ్ స్ఠాయి యాక్షన్‌ని ఇండియన్ సినిమాకి ప్రభాస్ (Prabhas) పరిచయం చేయగలిగాడు కదా.?
‘రాధేశ్యామ్’ (Radhe Shyam) సినిమా విషయంలోనూ ఫెయిల్యూర్ చవిచూసినా, అది కూడా ఓ కొత్త పాఠాన్ని నేర్పింది.! ఓ కొత్త ప్రయోగమైతే చేశానన్న ఆత్మ సంతృప్తి ప్రభాస్‌కి కలిగే వుండాలి.
Prabhas Darling Maruthi.. మారుతితో సినిమా వద్దు బాబోయ్.!
మారుతి దర్శకత్వంలో ఇటీవల ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) సినిమా వచ్చింది. అదెంత పెద్ద డిజాస్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మారుతి (Director Maruthi) సినిమాలంటేనే అంత.! సక్సెస్ అయినా, ఆ సినిమాపై విమర్శలొస్తుంటాయ్.

వద్దు డార్లింగ్.. మారుతితో సినిమా చేయొద్దు.. అంటూ అభిమానులు మొత్తుకుంటున్నారు. కానీ, ప్రభాస్ (Rebel Star PRabhas) వినడంలేదు.!
ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు.? అన్నట్టు, ప్రభాస్ – మారుతి కాంబినేషన్ ఫ్లాపే అవుతుందో, సంచలన విజయాన్ని అందుకుంటుందో ఎవరు ఊహించగలరు.?
ప్రభాస్ నమ్మాడంటే.. విషయం వున్నట్టే.!
‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ లాంటి సినిమాలు చేస్తున్న ప్రభాస్ (Young Rebel Star Prabhas), మారుతి దర్శకత్వంలో సిల్లీ సినిమా ఎలా చేస్తాడన్నది ప్రభాస్ అభిమానుల ప్రశ్న.
Also Read: కాజల్ అగర్వాల్ కొత్త ఇన్నింగ్స్.! కండిషన్స్ అప్లయ్.!
ఏమో, మారుతి ఏం కథ చెప్పాడో.. ప్రభాస్ (Pan India Rebel Star Prabhas) ఎలా ఆ కథకి కనెక్ట్ అయిపోయాడోగానీ, సినిమా లాంఛనంగా ప్రారంభమై, సెట్స్ మీదకు కూడా వెళ్ళబోతోంది.