Kajal Aggarwal Indian 2.. ఇది విన్నారా.? కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) మళ్ళీ సినిమాల్లో నటించబోతోందట.! అయితే, తప్పేంటట.?
తప్పేమీ లేదుగానీ, కాజల్ అగర్వాల్ సెప్టెంబర్ నుంచి షూటింగులకి హాజరు కాబోతోందట.!
అది కూడా, ప్రముఖ దర్శకుడు శంకర్ – విశ్వ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కావడమే విచిత్రమిక్కడ.!
శంకర్ – కమల్ హాసన్ కలిసి ప్రారంభించిన సినిమా ‘ఇండియన్-2’. చాన్నాళ్ళ క్రితం ఈ సినిమా పట్టాలెక్కింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
క్రియేటివ్ డిఫరెన్సెస్ మాత్రమే కాదు.!
దర్శకుడికీ, హీరోకీ పొసగలేదు. దర్శకుడికీ, నిర్మాతకీ మధ్య సమస్యలొచ్చాయ్. హీరోకీ నిర్మాతకి కూడా ఏవో ఇష్యూస్ వున్నాయ్.!
వామ్మో, ‘ఇండియన్-2’ సినిమాకి ఎన్ని సమస్యలో కదా.?! చెప్పుకుంటూ పోతే, ఇంకా చాలానే వున్నాయ్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మాత్రమే కాదు, రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తోంది.
‘బొమ్మరిల్లు’ సిద్దార్ధ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడండోయ్ ‘ఇండియన్-2’ సినిమా కోసం. శంకర్ సినిమా అంటే, బడ్జెట్ ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
Kajal Aggarwal Indian 2 .. కోట్లు వృధా అయ్యాయ్..
సినిమా ప్రారంభమయ్యింది.. కోట్లు ఖర్చు చేశారు.. అందులో చాలావరకు వృధా అయ్యింది కూడా. మధ్యలో ఇంత గ్యాప్ వచ్చాక, సమస్యలన్న తొలగిపోయినాగానీ.. సినిమా మునుపటి వేగంతో పూర్తవుతుందా.?

ఏమో, డౌటే.! ఈ మధ్యలో కాజల్ పెళ్ళి చేసుకుంది, ఓ బిడ్డకు తల్లయ్యింది కూడా. ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ‘విక్రమ్’ సినిమాతో కమల్ మంచి ఊపు మీదున్నాడు.
అన్నట్టు, రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న శంకర్, సెప్టెంబర్ నాటికి ఖాళీ అయి ‘ఇండియన్-2’ సినిమాకి రెడీ అవుతాడా.? సాధ్యమయ్యే పనేనా.?
Also Read: కోట్లు కొల్లగొట్టేసిందే.! ఊర్వశి రౌతెలా తప్పు ఏమున్నదబ్బా.?
కాజల్ (Kajal Aggarwal) మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా వుంది. ఆమె స్థానంలో ఇంకెవర్నో తీసుకుంటున్నారట.. అన్న ప్రచారం నేపథ్యంలో కాజల్ స్పందించింది.. సెప్టెంబర్ నుంచి ‘ఇండియన్-2’ షూటింగుకి వస్తానని చెప్పింది.
అన్నట్టు, ‘ఆచార్య’ సినిమాలో ఆమె నటించినా, ఆమె నటించిన సినిమాలకు కత్తెరేశారు.. ఆమెకు రెమ్యునరేషన్ ఇచ్చేశారు. మరి, ‘ఇండియన్-2’ సినిమా విషయంలో ఏం జరుగుతుందో.!