‘జాతిరత్నాలు’ టీమ్, తమ సినిమా ట్రైలర్ రిలీజ్‌ని చాలా కొత్తగా ప్లాన్ చేసింది. ఏకంగా పాన్ ఇండియా సూపర్ స్టార్.. ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్‌ని లాంఛ్ చేశారు. స్వతహాగా కామెడీ సినిమాల్ని ఇష్టపడే ప్రభాస్‌కి ‘జాతిరత్నాలు’ ట్రైలర్ (Prabhas Jathi Ratnalu Faria Abdullah) బాగా నచ్చేసింది.
ట్రైలర్ ఇంత ఎంటర్‌టైనింగ్‌గా వుందంటే, సినిమా కూడా ఇంత కంటే ఎక్కువ ఎంటర్‌టైనింగ్‌గా వుండి వుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ప్రభాస్. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ఫేం నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ప్రధాన తారాగణం.
హీరోయిన్ విషయానికొస్తే, ఆమె పేరు ఫరియా అబ్దుల్లా.. తొలి సినిమా విడుదల కాకుండానే అందరి దృష్టినీ ఆకర్షించేసింది. ప్రభాస్ అయితే, ‘ఇంత పొడుగ్గా వుందేంటీ.?’ అంటూ ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు. ఫరియా అబ్దుల్లా.. చూడగానే ఆకట్టుకునే అందం ఆమె సొంతం.
అంతేనా, ప్రభాస్ చెప్పినట్లు ఫరియా అబ్దుల్లా బాగా పొడగరి. అంతకు మించి ఇంకా చాలా క్వాలిటీస్ ఆమెలో వున్నాయి. మంచి నటి కూడా. సోషల్ మీడియాలో ఆమె (Jathi Ratnalu Faria Abdullah) పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఆమెలో ఎంత మంచి నటి వుందో.
ఇక, డాన్సుల్లో అయితే అదుర్స్ అంతే. ట్రెయిన్డ్ డాన్సర్ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే హిట్టు కొట్టేలా వుందంటూ ఫరియా గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. పెద్ద హీరోల సరసన ఒక్క మంచి సినిమా పడిందంటే.. ఆమె బీభత్సమైన స్టార్‌డమ్ సంపాదించుకోవడం ఖాయమని అనుకోవాలేమో.
ప్రస్తుతానికైతే టాలీవుడ్‌లో ఫరియా అబ్దుల్లా (Jathi Ratnalu Faria Abdullah) టాలెస్ట్ హీరోయిన్ అని ‘జాతి రత్నాలు’ టీమ్ అంటోంది.