Prabhas Marriage National Issue సమాధానం లేని ప్రశ్న.. అని తెలిసి ఆయనను ఎందుకు ఇబ్బంది పెడతారు.?
సర్లే ఆ ప్రశ్న ఎన్నిసార్లు అడిగినా నాకేం ఇబ్బంది వుండదు.. అని ప్రబాస్ చెప్పేసినా కూడా అడుగుతూనే వుంటుంది మీడియా.
మొదట్లో ఇది తెలుగు నేలపై అతి పెద్ద సమస్య అన్నట్టుగా చర్చ జరిగేది మీడియాలో. ఇప్పుడది జాతీయ సమస్య అయ్యి కూర్చుంది.
ప్రభాస్ పెళ్ళి.. పాన్ ఇండియా సమస్య.?
రేపొద్దున్న అంతర్జాతీయ సమస్యగా కూడా మారిపోతుందేమో. ప్యాన్ ఇండియా తర్వాత, ప్యాన్ వరల్డ్ టార్గెట్ కదా ప్రబాస్‌కి.!
సెలబ్రిటీలకి సంబంధించి వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని ఉత్సుకత జనంలో వుండడం మామూలే.
సరే, జనానికి ఆ ఇంట్రెస్ట్ వున్నా, లేకున్నా.. మీడియా మాత్రం బలవంతంగా జనాల మీద ఆ ఉత్సుకతను రుద్దేస్తూ వుంటుంది. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న. ప్రబాస్ స్థానంలో ఇంకెవరైనా వుంటే చిరాకు పడేవారే.
ప్రబాస్ కూడా అప్పుడప్పుడూ చిరాకు పడుతుంటాడు. కానీ, బయటికి కనబడనివ్వడు. మీరు ఎన్నిసార్లు అడిగినా నాకు చిరాకు రాదు.. అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చాడు ఈ రాధేశ్యామ్.

హస్త సాముద్రికం నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ సినిమా తెరకెక్కింది. సినిమా ఫ్లాప్ అయ్యింది. అది రీల్ లైఫ్. సరే, మరి, రియల్ లైఫ్‌లో పెళ్లి విషయమై ప్రబాస్ జాతకాల్ని నమ్ముతాడా.? అది ఆయన వ్యక్తిగతం.
Prabhas Marriage National Issue ప్రభాస్ పెళ్ళెప్పుడబ్బా.?
ఇంతకీ, ప్రబాస్ పెళ్లెప్పుడు.? మళ్లీ అదే ప్రశ్న. ప్రబాస్ దగ్గరే ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఇక్కడితో ప్రబాస్ పెళ్లి గురించి ఆలోచించడం, ఈ విషయమై ప్రబాస్‌ని ప్రశ్నించడం మీడియా మానేస్తే మంచిది.
ప్రబాస్ పెళ్లి చుట్టూ గాసిప్స్, వినీ వినీ జనాలకీ బోర్ కొట్టేసింది. ఇప్పుడు ప్రబాస్ పెళ్లి గురించి నిజమైన వార్త వచ్చినా జనం నమ్మే పరిస్థితి లేదు. దాని పట్ల జనానికి ఇంట్రెస్ట్ కూడా పోయింది.
Also Read: పెగ్గు వేస్తే ఆ దర్శకుడి పెన్ను నాట్యం చేస్తుందట.!
ఉందో, లేదో.. మీడియా మాత్రం వున్న ఆ చిన్న ఇంప్రెషన్ కూడా పోగొట్టేలా వుంది. పెళ్లంటూ చేసుకునే వుద్దేశ్యం వుంటే, ప్రబాస్ దాన్ని ఎప్పుడో అప్పుడు చెబుతాడు. ఈలోగా దాన్ని జాతీయ సమస్యగా మార్చడం శుద్ద దండగ.