Table of Contents
Prabhas Marriage: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే సమాధానం పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ అనే.!
అందుకే, ప్రభాస్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా ‘మీ పెళ్ళెప్పుడు.?’ అన్న ప్రశ్న సహజంగానే పుట్టుకొస్తుంది. ప్రభాస్ మాత్రమే కాదు, కృష్ణంరాజు సహా ప్రభాస్ కుటుంబ సభ్యులకు తరచూ మీడియా నుంచి ప్రభాస్ పెళ్ళి గురించిన ప్రశ్న ఎదురవుతుంటుంది.
Prabhas Marriage: ప్రభాస్ పెళ్ళెప్పుడో తెలుసా.?
ప్రభాస్ పెళ్ళెప్పుడో తెలుసా.? ప్రభాస్‌ని పెళ్ళాడబోయే ఆ లక్కీ గాళ్ ఎవరో తెలుసా.? ప్రభాస్, అనుష్క పెళ్ళంట.! అనుష్కతో ప్రభాస్ పెళ్ళి గురించి కృష్ణంరాజు ఏమన్నారంటే.! కృష్ణంరాజు సతీమణి చెప్పిన ప్రభాస్ పెళ్ళి కబుర్లు.! ఇలా కుప్పలు తెప్పలుగా వార్తలు, వీడియోలు దర్శనమిస్తుంటాయ్.

‘మిర్చి’ (Mirchi Prabhas) సినిమా సమయంలో పెళ్ళి ప్రస్తావన వస్తే, ‘అతి త్వరలో’ అని సమాధానమిచ్చాడు ప్రభాస్. ఇంతలో ‘బాహుబలి’ సెట్స్ మీదకు వెళ్ళడంతో అదో వంక దొరికింది.
సినిమాలు పెళ్ళికి అడ్డంకి అనగలమా.?
‘బాహుబలి’ (Baahubali) పూర్తయ్యాక ‘సాహో’ (Saaho) వల్ల ఆలస్యమన్నాడు.. ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ (Radhe Shyam). అయినా, పెళ్ళికి సినిమాలు అడ్డంకి అని ఎవరు చెప్పారు.? వర్కవుట్ అవడంలేదంతే.! నచ్చిన అమ్మాయి దొరక్కపోవడంతోనే ఈ జాప్యం అయి వుండొచ్చు.
అయితే, ఓ విషయంలో ప్రభాస్‌ని మెచ్చుకోవాలి. ఎప్పటికప్పుడు తన పెళ్ళి గురించి వచ్చే గాసిప్స్‌పై క్లారిటీ ఇచ్చేస్తుంటాడు. వాటిని ప్రభాస్ సహా అతని కుటుంబ సభ్యులు ఖండిస్తూనే వుంటారు. అయినాగానీ, కొత్త కొత్తగా పుకార్లు పుట్టుకొస్తూనే వుంటాయ్.
ప్రభాస్ – అనుష్క పెళ్ళట నిజమేనా.!
ప్రభాస్ (Prabhas) పెళ్ళయ్యేదాకా, ‘ప్రభాస్ – అనుష్క పెళ్ళంట’ అన్న గాసిప్స్ ఆగవు. ‘ప్రభాస్‌ని పెళ్ళాడబోయే లక్కీ గాళ్ ఎవరో తెలుసా.?’ అన్న గాసిప్స్ కూడా ఆగవంతే.!
అనుష్క (Anushka Shetty) కూడా ఫిమేల్ కేటగిరీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆమె కూడా పెళ్ళి దిశగా ప్రయత్నాలు చేయడంలేదో.. చేస్తున్నా వర్కవుట్ అవడంలేదో.!
Also Read: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. ఈ భ్రష్టత్వం ఎవరిదప్పా.!
ప్రభాస్ – అనుష్క (Prabhas Anushka) మంచి స్నేహితులు.. ఇద్దరూ భార్యాభర్తలుగా మారే అవకాశమే లేదని చాలా సందర్భాల్లో కృష్ణంరాజు (Krishnam Raju) స్పష్టత ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) ఇంటర్వ్యూల్లో కృష్ణంరాజు సతీమణి కూడా ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు.