Table of Contents
Anikha Surendran Esther Anil బాల నటీమణులు హీరోయిన్లుగా రాణించడం కొత్తేమీ కాదు. అతిలోక సుందరి శ్రీదేవి కాలం నుండీ వస్తున్నదే. అయితే, అప్పట్లో శ్రీదేవి మొదలుకొని, మీనా, రాశి.. ఇలా చాలా మంది బాల నటీమణులు హీరోయిన్లుగా రాణించారు. స్టార్‌డమ్ సంపాదించారు. అయితే, షాలినీ, షామిలి తదితర సెన్సేషనల్ బాల నటీమణులు హీరోయిన్లుగా నిలదొక్కకోలేకపోయిన సంగతి తెలిసిందే.
ఇక, నేటి తరంలోనూ బాల నటీమణులు కొందరు హీరోయిన్లుగా రాణించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్. ‘మేం వయసుకు వచ్చాం..’ అంటూ తమని తాము హీరోయిన్లుగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
సోషల్ మీడియా అటెన్షన్ పెంచే దిశగా హాట్ హాట్ లుక్స్‌తో అలరిస్తున్నారు. అయితే, హీరోయిన్లుగా ఎదిగే క్రమంలో, వారిలో ఎంతమంది సక్సెస్ బాటలో నడుస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Anikha Surendran Esther Anil ఎస్తేర్ అనిల్ ఘాటెక్కించే ‘దృశ్యం’
‘దృశ్యం’ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన చిన్నారి పేరే ఎస్తేర్ అనిల్. ‘దృశ్యం’ మొదటి పార్ట్‌లో చిన్న పిల్లగా నటించిన ఈ చిన్నారి బాల నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు, ‘నాకూ వయసొచ్చింది. నాలోనూ మంచి హీరోయిన్ దాగి వుంది. ఛాన్సిస్తే ప్రూవ్ చేస్తా..’ అంటోంది. ఆల్రెడీ తెలుగులో ‘జోహార్’ అనే సినిమాలో కనిపించింది ఎస్తేర్. మరిన్ని మంచి అవకాశాల కోసం ‘వెయిటింగ్’ అంటోంది.

ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. హాట్ హాట్ ఫోటో సెషన్లతో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అమ్మడి టాలెంట్ మెచ్చి ఇప్పటికే కొన్ని సినిమాల్లో హీరోయిన్లుగా ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయనుకోండి.
అనిఖా సురేంద్రన్ – ‘విశ్వాసం’
అజిత్ – నయనతార జంటగా తెరకెక్కిన ‘విశ్వాసం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన పాప అనిఖా సురేంద్రన్. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హీరోయిన్‌గా ఛాన్సుల కోసం ఎదురు చూస్తోంది.
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్. ఇప్పటికే మోడలింగ్‌లో సత్తా చాటుతోంది. డాన్సుల్లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. తమిళంలో హీరోయిన్‌గా ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు సైన్ చేసింది. అలాగే, కొన్ని కమర్షియల్ ప్రకటనల్లోనూ కనిపించింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఓ కమర్షియల్ యాడ్ షూట్‌లో నటించింది అనిఖా.
నిన్నటి చిచ్చరపిడుగులు.. రేపటి హీరోయిన్లు వీళ్లే..
‘దృశ్యం’ సినిమాలో టీనేజ్ అమ్మాయిగా నటించిన కృతికా జయ కుమార్ కూడా బాల నటీమణే. ఆ తర్వాత అల్లరి నరేష్‌తో ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మరో రెండు తెలుగు సినిమాల్లోనూ హీరోయిన్ వేషం కట్టింది. కానీ, ఆశించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు.
Also Read: దీపికా పదుకొనె ముద్దు ముచ్చట: ఎవరైనా ఎప్పుడైనా.!
అలాగే, ప్రణవి మానుకొండ, ప్రీతి అస్రాని, పాలక్ లల్వాని తదితర చిన్నారులు కమర్షియల్ హీరోయిన్లుగా సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నారు.
భాషతో సంబంధం లేకుండా, ఛాన్సొస్తే, హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా ఛాన్సులు దక్కించుకున్నారు. కానీ, సక్సెస్ రేటు అంతంత మాత్రంగానే వుంది. చూడాలి మరి, వీళ్లలో స్టార్ హీరోయిన్ల రేంజ్ అందుకునే చిచ్చర పిడుగులెవ్వరో (Anikha Surendran Esther Anil).