Prabhas Spirit Sandeep Statement.. సందీప్ రెడ్డి వంగా.. చేసింది తక్కువ సినిమాలే.. కానీ, దేశవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్నాడు.! కేవలం దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.!
ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే పేరు ఫైనల్ అయ్యింది.
కానీ, ఇప్పుడు త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది ‘స్పిరిట్’ సినిమాలో.!
Prabhas Spirit Sandeep Statement.. ఏం స్టేట్మెంట్ ఇచ్చావ్ సందీప్.?
‘స్పిరిట్’ సినిమా నుంచి తాజాగా ఓ గ్లింప్స్ వచ్చింది. అయితే, వీడియోలో ఎక్కడా నటీనటులు కనిపించలేదు. బ్లాక్ అండ్ వైట్.. కాన్సెప్ట్ అంతే.!
పూర్తిగా ఇంగ్లీషు అక్షరాలతో నింపేశాడు గ్లింప్స్‌ని. నిర్మాతలు, దర్శకుడు.. బ్యానర్.. వీటి గురించి పేర్కొన్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రకాష్ రాజ్, ప్రభాస్ డైలాగ్స్ వినిపిస్తున్నాయ్.
ఐపీఎస్.. ఆలిండియా టాపర్.. జైలు ఖైదీ.. ఇదీ ప్రభాస్ ఇంట్రడక్షన్. జైలర్, ప్రకాష్ రాజ్.! ఐపీఎస్ టాపర్, జైలుకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది.? అన్నదే కీ-పాయింట్ కావొచ్చు.

ఇక, ‘స్పిరిట్’ గ్లింప్స్‌తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అదే, ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్’ అని.!
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ఈ గ్లింప్స్ విడుదలైంది. అది కూడా, ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు.. ముగుస్తున్న సమయంలో.!
Also Read: ఖాళీ థియేటర్లో సినిమా ఎందుకు చూశావ్ బంగారమ్.?
ఇప్పుడీ, స్టేట్మెంట్.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ‘బాహుబలి’తో, దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు ప్రభాస్.
ఆ తర్వాత, ఏ సినిమా కూడా ఆ స్థాయిలో హిట్టవలేదు ప్రభాస్ నుంచి.! అయినాగానీ, పాన్ ఇండియా ఓపెనింగ్స్.. అంటే, ప్రభాస్ తర్వాతే ఎవరైనా.!

బాలీవుడ్ స్టార్లు సైతం, ప్రభాస్ సినిమా ఓపెనింగ్స్ ముందర తేలిపోవాల్సిందే. కానీ, దీన్ని అంగీకరించేందుకు బాలీవుడ్ మీడియా అస్సలు ఇష్టపడదు.
‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడంపై, సందీప్ రెడ్డి వంగాని బాలీవుడ్ మీడియా ట్రోల్ చేసిన వైనాన్ని ఎలా మర్చిపోగలం.?
ఇప్పుడేమో, ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్’ అనే ‘స్పిరిట్’ స్టేట్మెంట్, సందీప్ రెడ్డి వంగాపై బాలీవుడ్ మీడియా అక్కసు వెల్లగక్కడానికి కారణమైంది.
