హేయ్ పిల్లా! ఏం చూస్తున్నావ్? ఏం చూపిస్తున్నావ్?
Shraddha Das Selfie ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్‌కి అణువణువునా అందమే, ఒళ్లంతా వయ్యారమే.. అనడం అతిశయోక్తి కాదేమో.
అందుకే అమ్మడి అందాలను ఫాలో చేసే అభిమానుల సంఖ్య చాలా చాలా ఎక్కువ. కానీ, ఈ కథంతా కేవలం నెట్టింటి వరకే పరిమితం.
అమ్మడి అందానికీ, అభినయానాకి తగ్గట్లుగా పెద్ద తెరపై అవకాశాలు దక్కడం లేదు. హీరోయిన్‌గా వుండాల్సిన క్వాలిటీస్ అన్నీ పుష్కలంగానే వున్నాయ్ శ్రద్ధా దాస్‌లో.
ఎందుకో తెలీదు.. కానీ, తెలుగు మేకర్లను ఆ అందం అంతగా ఆకర్షించడం లేదు. దాంతో, అమ్మడు సోషల్ మీడియా టార్గెట్‌గా తన టాలెంట్ పంచి పెడుతోందిలా.
Shraddha Das Selfie సెల్ఫీ పాప గ్లామర్ కిర్రాక్.!
వరుస ఫోటో షూట్లతో శ్రద్ధా దాస్ ఎప్పుడూ బిజీ బిజీగా గడుపుతుంటుంది. తాజాగా ఓ సెల్ఫీ ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది శ్రద్ధా దాస్.
ఈ ఫోటోకి వస్తున్న కామెంట్లూ, లైకులూ, షేర్లూ అబ్బో పోటెత్తేస్తున్నాయంతే. అదిరే అందాల అభినేత్రి.. అని కొందరు కామెంట్ చేస్తుంటే.. సెల్ఫీ పేరు చెప్పి పిల్లా ఏం చూపిస్తున్నావ్.. అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా శ్రద్ధా దాస్ అందాల విందును ఎంజాయ్ చేస్తూ కుర్రకారు మాత్రం తెగ హుషారెత్తిపోతోంది. కెరీర్ విషయానికి వస్తే.. మొన్నామధ్య ‘ఏక్ మినీ కథ’ సినిమాలో డిఫరెంట్ రోల్ పోషించింది.
Also Read: Guess Who: జలకాలాటాల్లో ఎవరీ అందాల ‘చిరుత’.!
ప్రస్తుతం ‘నిరీక్షణ’, ‘అర్ధం’ అనే సినిమాల్లో నటిస్తోంది. కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా ట్రై చేస్తోంది శ్రద్ధా దాస్.