టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ కాస్తా.. ఇండియన్ సినిమా స్క్రీన్‌పై తిరుగులేని హీరో అనిపించుకున్నాడు.. పరిచయం అక్కర్లేని పేరది. ఆ పేరే ప్రభాస్ (Prabhas The Pan India Super Star). అయితే, ప్రభాస్ నుంచి సినిమాలు చాలా ఆలస్యంగా వస్తున్నాయన్న చిన్న బాధ అయితే అభిమానుల్లో అలాగే వుండిపోతోంది.
ఓ పది సినిమాలు వరసగా చేసేస్తే వచ్చే ఫాలోయింగ్ ఒకే ఒక్క సినిమాతో కొట్టేయడం బెటర్ కదా.. అన్నట్టుంది ప్రభాస్ ఆలోచన. కానీ, అభిమానులకు అలా కాదు కదా.. ప్రభాస్ నుంచి ఏడాదికి ఓ రెండు సినిమాలు కనీసం వస్తే బావుంటుందని అనుకుంటారు. వారి అభిమానం అలాంటిది.
ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం ప్రభాస్ సినిమాల లైనప్ చూసి అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అవుతోంది. ‘రాధేశ్యామ్’ షూటింగ్ జరుగుతుండగానే, ‘ఆదిపురుష్’ (Adipurush), ’సలార్’ (Salaar) సినిమాల్ని లైన్‌లోకి తీసుకొచ్చేశాడు. వీటితోపాటు నాగ్ అశ్విన్ (‘మహానటి’ ఫేం) దర్శకత్వంలో సినిమా కూడా పట్టాలెక్కబోతోంది.
అంటే, మొత్తం నాలుగు సినిమాలన్నమాట. వీటిల్లో ‘రాధేశ్యామ్’ షూటింగ్ చాలావరకు పూర్తయిపోయింది. ‘ఆదిపురుష్’ (Adi Purush) సినిమా మోషన్ క్యాప్చరింగ్ ఇటీవలే మొదలయ్యింది. ‘సలార్’ (Salaar Movie) కూడా ఇటీవలే లాంఛనంగా పూర్తయిన విషయం విదితమే.
కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సినిమాకి దీపికా పడుకొనే (Deepika Padukone) హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ త్వరలో ఇవ్వబోతున్నట్లు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ప్రకటించేశాడు.
సో, అభిమానులకు ముందు ముందు చాలా పండగలు రాబోతున్నాయన్నమాట.. వరుస సెల్రబేషన్లకు అభిమానులు సిద్ధమైపోవాల్సిందే ఇకపై. అయినాగానీ, చిన్న లోటు.. అదే ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) విడుదల ఆలస్యమవుతుండడం. కాస్త ఆలస్యమైనాసరే, పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభాస్ (Prabhas The Pan India Super Star) దుమ్మురేపేయడం అయితే ఖాయమే.