Pragya Jaiswal.. ప్రగ్యా జైశ్వాల్.. ఈ పేరు కన్నా‘సీత’ అనే పేరు ఈ ముద్దుగుమ్మకు బాగా సెట్ అవుతుందేమో. తొలి సినిమా ‘కంచె’లో సీత పాత్రలో అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న నటిలా మెప్పించింది ఆ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్.
తొలి సినిమా ఆ స్థాయిలో హిట్ అవ్వడంతో టాలీవుడ్‌కి ఓ మంచి హీరోయిన్ దొరికిందనుకున్నారంతా. కానీ, ప్రగ్యా ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు దక్కించుకోలేకపోయింది. క్లాసిక్ లుక్స్‌తో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మకి డాన్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ క్లాసికల్ డాన్స్ అంటే అమితమైన ప్రేమ అని చెబుతుంటుంది.
Pragya Jaiswal, అంతకు మించి..
క్లాసికల్ రోల్స్‌కే కాదు, గ్లామర్‌లోనూ తానేం తక్కువ కాదని ప్రూవ్ చేసుకుంది ప్రగ్యా జైశ్వాల్. బోయపాటి శీను డైరెక్ట్ చేసిన ‘జయ జానకి నాయకా’ సినిమాలో గ్లామర్ రోల్‌లో కనిపించి అదరగొట్టేసింది. కానీ, ఆమె అందం వేస్ట్ అయ్యింది. గ్లామర్ చూపించినా అవకాశాలు మాత్రం దక్కలేదు. అయితే, అందం కంటే, అభినయం ఉన్న పాత్రల్లోనే ప్రగ్యా జైశ్వాల్ బాగా ఒదిగిపోతుందనేది ఆడియన్స్ అభిప్రాయం.

మంచి పొడగరి. ఆమెకి అవకాశాలు దూరం కావడానికి ఆమె హైట్ కూడా ఓ కారణం కావచ్చేమో. ఇక, సోషల్ మీడియాలోనూ ప్రగ్యా జైశ్వాల్ హైపర్ యాక్టివ్. పొట్టి పొట్టి దుస్తులు ధరించి, తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని డిఫరెంట్‌గా ప్రమోట్ చేస్తూ కుర్రకారుకు గ్లామర్ వలలు విసురుతూ ఉంటుంది హాట్ హాట్ ప్రగ్యా జైశ్వాల్.
Also Read: Niharika Konidela అందుకే సినిమాలు మానేసిందా.?
నందమూరి నటసింహం బాలయ్యతో ‘అఖండ’ సినిమాలో అనూహ్యంగా ఛాన్స్ కొట్టింది అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. కెరీర్ డల్‌గా ఉన్న తరుణంలో వచ్చిన ఈ అరుదైన ఆఫర్‌తో తనకు స్టార్‌డమ్ దక్కుతుందని ఆశిస్తోంది. అన్నట్లు ఈ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) రెండు సార్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.