Table of Contents
Shefali Jariwala Death Mystery.. వయసు మీద పడినా వన్నె తగ్గని అందం ఆమె సొంతం.. వయసు మీద పడ్డ మహిళల అందాన్ని ఇలా వర్ణిస్తుంటాం.
అందంగా వుండాలనుకోవడం తప్పెలా అవుతుంది.? అస్సలు తప్పు కాదు. కాకపోతే, అందంగా వుండాలనే ‘పిచ్చి’లోపడి, ప్రాణమ్మీదకు తెచ్చుకుంటేనే కష్టం.
మార్కెట్లో, అందంగా కనిపించేందుకు అనేక అవకాశాలున్నాయి. ఖర్చుకు వెనుకాడకపోతే, ఏ వయసులో అయినా, అందంగా కనిపించొచ్చు.. ఎలాంటివాళ్ళయినా.
మానసిక అందం వేరు.. శారీరక అందం వేరు..
అందం అనేది మనసుకు సంబంధించినది.. అంటుంటారు కొందరు. కానీ, శారీరక అందం గురించి ఎక్కువమంది ఆరాటపడుతుంటారు.
అందుకే, ‘అందం’ చుట్టూ నడిచే బిజినెస్.. వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ని కలిగి వుంటుంది.. ప్రపంచ వ్యాప్తంగా అయితే, ఇది లక్షల కోట్ల బిజినెస్.

ఫేస్ క్రీముల దగ్గర్నుంచి, యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ వరకు.. చెప్పుకుంటూ పోతే, అదో పెద్ద కథ. అందం వెంట పరిగెడుతూ, కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
షెఫాలీ జరీవాలా డెత్ మిస్టరీ..
బాలీవుడ్ నటి, ‘కాంటా లాగా’ ఫేం షెఫాలీ జరీవాలా ఇటీవల అకాలమరణం చెందింది. ఎలా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
కార్డియాక్ అరెస్ట్.. అని వైద్యులు ధృవీకరించారు. అయితే, రోజంతా ఉపవాసం వుండి, సాయంత్రం యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే ప్రాణాలు కోల్పోయిందనే వాదనలు తెరపైకొచ్చాయి.
పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్‌మార్టమ్ జరిగింది గనుక, ఆ నివేదికలో ఏం తేలుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
Shefali Jariwala Death Mystery.. మీరా చోప్రా ఏం చెబుతోందంటే..
షెఫాలీ వయసు 42 ఏళ్ళు. నిజానికి, ఆమెను చూస్తే, వయసు 42 కాదు, 24 అనే అనిపిస్తుంది. అంతలా ఆమె తన ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్ చేస్తుంటుంది.
మరింత తెల్లగా కనిపించేందుకు, మరింత నాజూగ్గా వుండేందుకు.. రకరకాల సౌందర్య ఉత్పత్తులు, వివిధ రకాల చికిత్సలు తీసుకుంటుంటుందట షెఫాలీ జరీవాలా.

మరో నటి మీరా చోప్రా, ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ ఐవీ ద్వారా తీసుకుంటారనీ, నిపుణులు కాని వారు ఇంజెక్షన్ చేసినా, చేసుకున్నా.. దుష్పలితాలు ఇలానే వుంటాయని మీరా చోప్రా పేర్కొంది.
అందంగా వుండాలన్నా.. ప్రాణంతో వుండాలి కదా.?
ఇందులో కొంత వాస్తవం వుంది. వైద్యుల సలహాతో, ఇంటి దగ్గరే సదరు ఇంజెక్షన్ ఐవీ రూపంలో కొందరు సెలబ్రిటీలు, హైఫై లైఫ్ గడిపే, ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు వాడుతుంటారు.
అన్నట్టు, ఈ మధ్య మగవాళ్ళు కూడా ఇలాంటి చికిత్సలు చేయించుకుంటున్నారు. ఇవే అకాల మరణాలకు కారణాలన్న అనుమానాలూ లేకపోలేదు.
Also Read: ‘కుబేర’ రివ్యూ.! లక్ష కోట్లు వర్సెస్ ఓ బిచ్చగాడు.!
ప్రాణం వుంటేనే కదా, అందంగా వుండడం.. అందంగా లేకపోవడం.. అనే దాని గురించిన చర్చ. సో, ప్రాణం విలువైనది. అందం వెంట పరుగులు తీయడం, ఈ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరం.

షెఫాలీ జరీవాలా విషయంలో ఏం జరిగిందన్నదానిపై ముందే ఓ కంక్లూజన్‌కి రాలేం. కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. అని పెద్దలు ఊరకే అన్నారా.?
లైఫ్ ఈజ్ అన్ ప్రిడిక్టబుల్.!