Pragyan Rover Chandrayaan3.. అదో బుల్లి వాహనం.! ‘రోవర్’ అంటాం.! దానికో క్యూట్ నేమ్.! అదే ప్రగ్యాన్.!
చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా, చంద్రుడి మీదకి విక్రమ్ ల్యాండర్‌ని పంపించాం కదా.! చంద్రయాన్-2 పాక్షిక విజయం సాధించిందిగానీ.. పూర్తి విజయం సాధించి వుంటే, ఆ లెక్క వేరేలా వుండేదేమో.!
అయితేనేం.. ఈసారి తేడా రాలేదు.! పక్కాగా, విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద దిగేసింది. అందులోంచి, ఓ బుజ్జి రోవర్.. అదేనండీ మన క్యూట్ ప్రగ్యాన్ గాడు.. బయటకు వచ్చేశాడు.!
Pragyan Rover Chandrayaan3.. చంద్రుడి మీద అల్లరి చేస్తున్నాడు..
సరదాగా అలా మూన్ వాక్‌కి వెళ్ళిన మన ప్రగ్యాన్.. చిన్న గొయ్యకి దగ్గరగా వెళ్ళిపోయాడట. వెంటనే, కంగారు పడి, మన సైంటిస్టులు.. ప్రగ్యాన్ గాడ్ని వెనక్కి వచ్చేయమని చెప్పారట.!
భలేగుంది కదూ.! ప్రగ్యాన్ గాడి కళ్ళతో చందమామ ఉపరితలాన్ని చూడటం ఓ అత్యద్భుతమైన అనుభూతి.
అంతేనా, అక్కడే వున్న అన్నయ్య ‘విక్రమ్’ని కూడా ప్రగ్యాన్‌గాడు ఫొటోలు తీసేస్తున్నాడు.! ఆ ఫొటోల్ని ఇస్రో ఎప్పటికప్పుడు మన ముందుంచుతోంది.
చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండర్‌ని దించిన తొలి దేశం మనదే.! అక్కడి వాతావరణ విశేషాల్ని ప్రగ్యాన్ గాడు మనకి తెలియజేస్తున్నాడు. అంతేనా, చంద్రుడి మీద చిన్న ‘కన్నం’ కూడా పెట్టి, లోపలి ఉష్ణోగ్రతల్నీ కొలిచి చెబుతున్నాడు.

చాలా చాలా చల్లగా వుంటుందట లోపలి ఉష్ణోగ్రత. బయట మాత్రం, చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు వుంటాయట. అక్కడ లభించే రకరకాలైన మూలకాల గురించీ ప్రగ్యాన్ గాడు విలువైన సమాచారం పంపిస్తున్నాడు.
సిన్నోడేగానీ.. మామూలోడు కాదు మన ప్రగ్యాన్ గాడు.. ఆడో బుల్లి సైంటిస్టు మరి.!
కోట్లు ఖర్చు చేసి మరీ విక్రమ్ ల్యాండర్‌నీ అందులో, ప్రగ్యాన్ రోవర్‌నీ పంపించాం కదా.! దానికి తగ్గట్టే, అక్కడ ఆ రెండూ.. బాగా పని చేస్తున్నాయ్. చాలా చాలా బాగా పని చేస్తున్నాయ్.!
కొన్నాళ్ళే పని చేస్తాయా.?
చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌కి మొత్తంగా 14 రోజుల సమయమే వుందిట.! ఆ తర్వాతో.! ఆ వివరాలు ఇస్రో సవివరంగా చెబుతుంది లెండి.!
అయినా, గడువు తీరాక కూడా పని చేయడం మన శాటిలైట్ల ప్రత్యేకత కదా.! సో, ప్రగ్యాన్ అలాగే విక్రమ్.. ఇంకాస్త ఎక్కువ కాలం పనిచేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Also Read: దేశం మనది.. జాతీ మనది.. ఎగురుతున్న జెండా మనదీ.!
చందమామ.. పేదరాసి పెద్దమ్మ.. ఈ కథలు చిన్నప్పుడు చాలామంది వినే వుంటారు కదా.! ఇప్పుడు కథలు కాదు, చందమామ విశేషాల్ని, గర్వంగా చెప్పుకుంటున్నాం.! చెప్పుకోవాలి కూడా.!
శాస్త్ర సాంకేతిక రంగాల్లో.. అందునా, స్పేస్ సైన్స్ విషయంలో భారతదేశం సాధించిన అత్యద్భుత ప్రగతి గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటే సరిపోదు.. మనం ఇంకా లోతుగా చర్చించుకోవాలి.. మన పిల్లలకు విడమర్చి చెప్పాలి కూడా.!