Prakash Raj Papishti Prema.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, ‘లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. అలానే, ఆంధ్రలో పుట్టినోళ్ళంతా తెలంగాణ ద్రోహులే’ అనే స్టేట్మెంట్ పాస్ చేసేశారు.
ఆ కేసీయార్‌ని చంకనేసుకుని బెంగళూరు, చెన్నయ్ తిరిగాడు ప్రకాష్ రాజ్, జాతీయ స్థాయిలో చక్రం తిప్పేయాలన్న కసితో.!
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తరఫున, బిహారీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని వెంటేసుకుని తిరిగిన ఘనుడు ప్రకాష్ రాజ్.!
సరే, కర్నాటక నుంచి లోక్ సభకు పోటీ చేసి ప్రకాష్ రాజ్ ఓడిపోయాడనుకోండి.. అది వేరే సంగతి. రాజకీయాల్లో గెలుపోటములు మామూలే.!
టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్ళేందుకు బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చిన కేసీయార్, లోక్ సభ ఎన్నికల్లో గుండు సున్నా చుట్టేయడం మరో ఆసక్తికర అంశం.
Prakash Raj Papishti Prema.. లంకలో పుడితే రాక్షసులు.. పాకిస్తాన్లో పుడితే..?
లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులు అయినప్పుడు, పాపాల పాకిస్తాన్లో పుట్టినోళ్ళంతా పాపిష్టి వెధవలని కదా, ప్రకాష్ రాజ్ నమ్మాల్సింది.?
ఎవరైతే గొప్ప నాయకుడని ప్రకాష్ రాజ్ భావిస్తుంటాడో, ఆ కేసీయార్ సిద్ధాంతమే కదా ఇది.! కానీ, పాకిస్తానీ నటుడికి ప్రకాష్ రాజ్ అండగా నిలబడటమేంటి.?
పహల్గామ్ టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో పాకిస్తానీ నటుడి సినిమా ఒకటి ఆగిపోయింది. చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణయమది. అతని పేరు, ఆ సినిమా పేరు గురించి ప్రస్తావించడం అవసరం లేదేమో ఇక్కడ.
Also Read: ఛ.! నిజమా.? నీకెవరు చెప్పారు పాయల్.?
అబ్బే, నటనకు ప్రాంతీయ బేధాల్లేవంటూ ప్రకాష్ రాజ్ చెబుతున్నాడు. నిజమే, నటనకు ప్రాంతీయ బేధాల్లేవ్. కానీ, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కి చెందిన నటుడ్ని వెనకేసుకొస్తే ఎలా.?
ఆ దిక్కుమాలిన పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాల్నే తెంచుకున్నాం మనం. అలాంటిది, ఆ పాకిస్తానీ నటుడి సినిమాని మనం చూడాలా.? నాన్సెన్స్ కాకపోతే ఏంటిది ప్రకాష్ రాజ్.?
హిందువులా.? కాదా.? అని నిర్ధారించుకుని మరీ, పహల్గామ్లో పర్యాటకులపై పాశవిక దాడి చేసి, చంపేశారు పాకిస్తానీ టెర్రరిస్టులు. బాధిత కుటుంబాల ఆవేదన ప్రకాష్ రాజ్‌కి ఎలా అర్థమవుతుంది.?
నలుగురూ నవ్విపోదురుగాక ప్రకాష్ రాజ్కేటి సిగ్గు.?