Table of Contents
Prakash Raj ప్రముఖ సినీ నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడట.! కొత్తగా వచ్చేదేంటి.? గతంలోనే ఆయన ఎన్నికల బరిలోకి దిగాడు కదా.! దిగి, ఓటమి పాలయ్యాడు కదా.!
రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. ఓడినోడ్ని తక్కువగా చూడటం సబబు కాదు.! ఇంతకీ, ప్రకాష్ మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగుతాడా.?
గత కొంతకాలంగా ప్రకాష్ రాజ్, తెలంగాణ రాష్ట్ర సమితితో అసోసియేట్ అయి వున్నారు. ఆయన ఆ పార్టీలో చేరలేదు. కానీ, టీఆర్ఎస్ తరఫున రాజకీయంగా వకాల్తా పుచ్చుకుంటున్నారు.
కేసీయార్ పార్టీలో Prakash Raj..
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రకాష్ రాజ్‌ని వెంటేసుకుని కొద్ది నెలల క్రితం బెంగళూరు వెళ్ళారు. అక్కడ మాజీ సీఎం కుమారస్వామి పార్టీతో మంతనాలు జరిపారు.
ఆ కుమారస్వామి, ఇటీవల తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి జెండాని కేసీయార్ ఆవిష్కరించినప్పుడు.. ప్రకాష్‌రాజ్‌తోపాటు కలిసి కనిపించారు.
కేసీయార్, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన సంగతి తెలిసిందే. ఆ భారత్ రాష్ట్ర సమితి తరఫున కర్నాటక నుంచి ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలోకి దిగతాడన్నది జరుగుతున్న ప్రచారం.
తప్పేముంది.? ఓడిపోతే నేరం చేసినట్టు కాదే.!
ఎన్నికలకు చాలా సమయం వుంది. అసలు ప్రకాష్ రాజ్ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? అన్నది ఇప్పుడే చెప్పలేం.
ఓ సారి ఎన్నికల్లో ఓడినంత మాత్రాన, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లోనూ ఓడిపోయినంత మాత్రాన, ప్రకాష్ రాజ్ కాలిబర్‌ని తక్కువ అంచనా వేయలేం.
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ప్రకాష్ రాజ్ మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం వునన వ్యక్తి. కాకపోతే, కొంత ‘అతి’ ఎక్కువ. అదే ఆయన కొంప ముంచుతుంటుంది.
జస్ట్ ఆస్కింగ్ రాజకీయం.!
అన్నట్టు, ప్రకాష్ రాజ్ అంటే భారతీయ జనతా పార్టీకి అస్సలు పడదు. ఆయన భావజాలం వేరు. చాలాసార్లు బీజేపీ శ్రేణుల నుండి ట్రోలింగ్ ఎదుర్కొన్నారాయన.
Also Read: మెగాస్టార్ చిరంజీవికి అవార్డొస్తే.. వాళ్ళకి ఏడుపొస్తుంది.!
జస్ట్ ఆస్కింగ్.. అంటూ తరచూ సోషల్ మీడియాలో బీజేపీ విధానాల్ని, మోడీ సర్కారు వైఫల్యాల్నీ ఎత్తి చూపుతుంటారు ప్రకాష్ రాజ్.
బహుశా అదే, కేసీయార్‌కి ప్రకాష్ రాజ్ దగ్గరయ్యేలా చేసిందేమో.!