Prakash Raj Supports Maoism.. సినీ నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా వేదికగా పెద్ద పెద్ద మాటలు చెబుతుంటాడు. మీడియా ముందుకొచ్చినా అంతే.!
బంగ్లాదేశ్‌లో ఓ హిందూ యువకుడ్ని అతి కిరాతకంగా అక్కడి అల్లరి మూకలు సజీవ దహనం చేసేస్తే, స్పందించలేకపోయాడు ప్రకాష్ రాజ్.
హిందూ వ్యతిరేక భావజాలాన్ని నరనరాన నింపేసుకున్న ప్రకాష్ రాజ్, సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూస్తూనే వున్నాం.
ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీదా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీదా సోషల్ మీడియా వేదికగా వెటకారాలు చేస్తుంటాడు ప్రకాష్ రాజ్
ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా నక్సలైట్లను వెనకేసుకొచ్చాడు ఈ సినీ నటుడు. నక్సలైట్లు కూడా మన దేశ ప్రజలే కదా, వాళ్ళని చంపడమేంటి.? అంటూ, ప్రశ్నించేశాడు.
నిజమే, నక్సలైట్లు భారత పౌరులే.! కానీ, నక్సలైట్లు చంపుతున్నదెవర్ని.? భారత ప్రజలైన భద్రతా సిబ్బందినే కదా.! కొన్నిసార్లు, నక్సలైట్లు, సామాన్య పౌరుల్ని కూడా చంపేయడం చూస్తున్నాం.
దేశంలోంచి నక్సలిజాన్ని తరమివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
నక్సలిజంలో వుండలేమంటూ, జన జీవన స్రవంతిలోకి పేరొంది మావోయిస్టులే వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా.! కానీ, ఇవేవీ ప్రకాష్ రాజ్ కళ్ళకు కనిపించవు.
ఇక, సినిమా టిక్కెట్ల ధరల విషయంలో కూడా, అహంకార పూరితమైన వ్యాఖ్యలు చేశాడు ప్రకాష్ రాజ్. ‘టిక్కెట్ల ధరలు ఎక్కువైతే, సినిమా చూడ్డం మానెయ్యండి.. ఇది వ్యాపారం’ అంటూ వ్యాఖ్యానించాడీ సినీ నటుడు.
అన్నట్టు, వస్త్ర సన్యాసం విషయంలో అనసూయ భరద్వాజ్‌ని సమర్థిస్తూ ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా వేదికగా స్పందించడం కొసమెరుపు.!
మిగతా విషయాలెలా వున్నా, ప్రజాస్వామ్యంలో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమాంతరంగా, మరో వ్యవస్థను నడపాలన్న నక్సలిజం లేదా మావోయిజం.. అంతమవ్వాల్సిందే.
దురదృష్టం, ప్రకాష్ రాజ్ లాంటోళ్ళు.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నక్సలిజం, మావోయిజంకి అనుకూలంగా మాట్లాడుతుంటారు.!
